Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్​లో పనిచేసే మహిళా ఉద్యోగులు  ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడానికి వీల్లేదని తాలిబన్​ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

Afghanistan

Afghanistan షరియా చట్టాల పేరుతో మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు ఆంక్షలను విధిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్​లో పనిచేసే మహిళా  ఉద్యోగులు  ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడానికి వీల్లేదని తాజాగా తాలిబన్​ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్లు చర్యలు చేపట్టడం వారం రోజుల్లో ఇది మూడోసారి. అయితే కేవలం మహిళలు చేసే పనులకు మాత్రమే వారిని అనుమతించనున్నట్లు కాబుల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నమోనీ తెలిపారు. డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. అటు పురపాలక విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నమోనీ తెలిపారు.

కాగా, మహిళల చదువుకు, ఉద్యోగాలకు అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. శనివారం ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖనే ఎత్తేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ‘వైస్ అండ్​ వర్చ్యూ మంత్రిత్వ శాఖ’ ను తీసుకొచ్చింది తాలిబన్ ప్రభుత్వం. ఇందులో సభ్యులంతా పురుషులే ఉన్నారు. అయితే మహిళలకు.. పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తామని తొలినాళ్లలో చెప్పిన తాలిబన్లు అందుకు పూర్తి భిన్నంగా ఆంక్షలు విధించటంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. 1990 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు అఫ్ఘాన్​లో వరల్డ్ బ్యాంకు చేపట్టిన 100మిలియన్​ డాలర్ల మహిళ ఆర్థిక సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడి సిబ్బంది అఫ్ఘాన్​ను విడిచి వెళ్లిపోవడమే ఇందుకు కారణం.

READ Bacrtian treasure : తాలిబన్ల రాజ్యంలో ‘బ్యాక్ట్రియన్ ఖజానా’.. 2000 ఏళ్లనాటి బంగారు నిధి.. సినిమాను తలపించే స్టోరీ