strange disease
Strange Disease : ఆఫ్రికాలోని గినియా దేశాన్ని వింత వ్యాధి వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఈ వ్యాధి పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఇన్ ఫెక్షన్ భయంతో దాదాపు 200 మందిని క్వారంటైన్ లో ఉంచారు. ఈ వింత వ్యాధి తొలుత నాలుగు రోజుల క్రితం గుర్తించినట్లుగా గినియా ఆరోగ్య మంత్రి ఓండో చెప్పారు.
ఈ గుర్తు తెలియని వ్యాధిని గుర్తించే పనిలో డబ్ల్యూహెచ్ వో నిమగ్నమైంది. ఈ వింత వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు రోగుల నుంచి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాంగుకు పంపుతున్నారు. మరికొన్ని నమూనాలను సెనెగల్ రాజధానికి పంపుతున్నారు. ఈ వ్యాధికి గురైన వారిలో రక్తస్రావంతో పాటు జ్వరం కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Mystery disease : సూడాన్ లో వింత వ్యాధితో 100మంది మృతి..
ఇలా కనిపించిన తర్వాత తొలుత ముక్కు నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఆ తర్వాత జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి కనిపిస్తోంది. ఇలా నొప్పులను భరిస్తూ రోగి కొన్ని గంటల తర్వాత రోగి మరణిస్తున్నాడు. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వ్యాధికి గురైనట్లుగా అనుమానిస్తున్న దాదాపు 200 మందిని ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది. వింత వ్యాధి కారణంగా దేశంలో రెండు గ్రామాల మద్య రాకపోకలను నిషేధించింది. ప్రస్తుతం కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో ఇక్వటోరియన్, గినియాతో సరిహద్దులు దాదాపు మూసివేసినట్లుగా పొరుగు దేశం కామెరూన్ తెలిపింది.