ధోతీ-చీర ధరించి నోబెల్ అందుకున్న అభిజిత్-డఫ్లో

ఇండో అమెరికన్ ఎకనామిస్ట్ అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో 2019 ఎకనామిక్ సైన్సెస్‌ అవార్డు దక్కించుకున్నారు. భార్యభర్తలైన డా.బెనర్జీ, డా.డఫ్లో స్నేహితుడితో కలిసి ముగ్గురు పురస్కారాన్ని అందుకున్నారు. భారత దుస్తుల్లో (చీర, ధోతీల్లో) అవార్డు కార్యక్రమానికి విచ్చేశారు. స్టాక్ హోమ్‌లోని కాన్సెర్ట్ హాల్‌లో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. 

ఈ సందర్భంగా నోబెల్ ప్రైజ్ కమిటీ 2నిమిషాల వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికి ఈ బహుమతి వరించింది. దీంతో పాటు 90 లక్షల స్వీడిష్ క్రోనాల(సుమారు రూ.6.5 కోట్లు)ను కూడా అందజేశారు. 

 
ఇరవైఏళ్లుగా ముగ్గురు కీలక పాత్ర పోషించారని కమిటీ తెలిపింది. ముంబైలో 1961లో జన్మించిన అభిజిత్ బెనర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్‌లో ‘ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్’గా పనిచేస్తున్నారు.