Afghan Embassy : భారతదేశంలో రాయబార కార్యాలయంపై అప్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ పాలకులు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆతిథయ భారత ప్రభుత్వం నుంచి మద్ధతు లేకపోవడంతో అఫ్ఘాన్ ప్రజల ప్రయోజనాలను చేకూర్చలేకపోవడం వల్ల అక్టోబర్ 1వతేదీ నుంచి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు భారతదేశంలోని అప్ఘానిస్థాన్ ఎంబసీ శనివారం రాత్రి ప్రకటించింది. (Afghan Embassy Announces Decision To Cease) ఈ నిర్ణయం ప్రకటిస్తున్నందుకు తాము చింతిస్తున్నామని అఫ్ఘాన్ పేర్కొంది. ( India Operations From Today)
Road Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి
అఫ్ఘాన్, భారత్ దేశాల మధ్య చారిత్రక సంబంధాలు, దీర్ఘకాల భాగస్వామ్యం ఉన్నా తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయక తప్పటం లేదని ఆ దేశం తెలిపింది. తమ దేశం పట్ల భారత్ ఆసక్తి చూపించక పోవడం, రాయబార కార్యాలయంలో సిబ్బంది, వనరులను తగ్గించిందని అప్ఘాన్ తెలిపింది. అఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో రాయబారిగా ఫరీద్ మముంద్‌జాయ్ పనిచేశారు. మముంద్‌జాయ్‌ను మునుపటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించింది.
Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన
2021వ సంవత్సరం ఆగస్టు నెలలో అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా అతను అఫ్ఘాన్ రాయబారిగా పనిచేస్తున్నారు. భారతదేశం ఇంకా తాలిబన్ల సర్కారును గుర్తించలేదు. అప్ఘానిస్థాన్ ప్రజల శ్రేయస్సు కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
Ashwin : రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు..
దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ (1961)లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశం యొక్క సంరక్షక అధికారానికి బదిలీ చేస్తారు. రాయబార కార్యాలయం మూసివేసినా అప్ఘాన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ దేశం వివరించింది.