ప్రకృతి లో జరిగే కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు భలే వింత గొలుపుతుంటాయి. ఇలాంటివి వార్తల్లో చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అడవిలో అనేక రకాల వన్యప్రాణులు నివసిస్తుంటాయి. వీటి రకాలను బట్టి అటవీ సిబ్బంది వాటిని ఒకే చోట పెంచుతూ ఉంటారు. ఇటీవల షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లో ఒక జీబ్రా, జోంకీ కి జన్మనిచ్చిన సంగతి చూసి ఆశ్చర్య పోయారు. జోంకీ ఏంటా అనుకుంటున్నారు. కదా… జీబ్రా కు గాడిదకి పుట్టిన హై బ్రీడ్ జాతి జంతువు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్లోని పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది…. ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది అని చెప్పారు కానీ ఇలా ఆఫ్రికాలో ఎక్కడో జోంకీ పుడుతుందని చెప్పారో లేదో తెలీదు కానీ, ఆఫ్రికాలోని అడవిలో మాత్రం ఒక జీబ్రాకు గాడిదతో సంబంధం ఏర్పడి జోంకీకి జన్మనిచ్చింది.
ఆఫ్రికాలోని షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ (Sheldrick Wildlife Trust) గత మే లో ముటోమో స్టేషన్‌లోని మొబైల్ వెటర్నరీ యూనిట్‌కు ఒక ఫోన్ వచ్చింది.సావో ఈస్ట్ నేషనల్ పార్క్ లో జీబ్రా, గాడిద కానీ ఒక కొత్త జంతువు జీబ్రాతో కలిసి తిరుగుతోందని ఆ ఫోన్ సమాచారం. అటవీ సిబ్బంది దాన్ని గుర్తించారు. అది ఎలా పుట్టిందనే దానిపై పరిశోధన చేశారు. ఆ జీబ్రా అక్కడి సమూహం లోనిదే అని గుర్తించారు. మరి గాడిద ఆకారంలో బ్రౌన కలర్ లో ఒంటిపై నల్లటి చారలతో ఉన్న ఒక చిన్న గాడిద పిల్ల జీబ్రా వెంట తిరుగుతోంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానిపై ఆరా తీయటం మొదలెట్టారు.(లాఠీ లాక్కొని పోలీస్‌నే చితకబాదిన వ్యక్తి)
ప్రస్తుతం అక్కడ ఉన్న మిగాతాజీబ్రా సమూహంలో తిరుగుతోంది.దాన్ని అక్కడి నుంచి కొత్త ప్రదేశానికి మార్చటానికి అటవీ సిబ్బంది ప్రయత్నించారు. జీబ్రాను, జోంకీని చ్యులు నేషనల్ పార్క్‌లోని(Chyulu National Park) కెంజ్ యాంటీ-పోచింగ్ టీమ్ స్థావరానికి మార్చారు. కొత్త ప్లేస్ లో జీబ్రా అలవాటు పడింది. వీటిని అక్కడ వదిలేసిన తర్వాత అడవిలో కంచె నిర్మించే కార్మికులు వీటి గురించి తెలిపారు.
గత ఏడాది మొదట్లో జీబ్రా అడవిలోని ఒక గాడిదల మందతో తిరగటం చూశామని కార్మికులు వివరించారు. ఆ మందలోని ఒక గాడిద జీబ్రాతో జత కట్టటం వల్ల జోంకీ జన్మించిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. సాధారణంగా జీబ్రా గర్బధారణకాలం 12 నెలలు. జీబ్రా పిల్ల పుట్టినప్పుడు బ్రౌన్ మరియు వైట్ స్ట్రిప్స్‌తో పుడతాయి, ఇవి చివరికి నల్లగా మారుతాయి. కానీ జోంకీ రూపు రేఖల్లోనూ, రంగులోనూ డాంకీ ని పోలి ఉండి.. కాళ్లపై నల్లటి చారలు వున్నాయి. ప్రస్తుతానికి రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయని పశువైద్యనిఫుణులు చెప్పారు. వీటిని చూసిన తర్వాత ప్రకృతిలో జరిగే అద్భుతాలు భలే ఆశ్చర్యం గొలుపుతున్నాయి.