×
Ad

15 మంది భార్యలు, 100 మంది సహాయకులతో ఆఫ్రికన్ రాజు యూఎఈ టూర్.. వీడియో మళ్లీ వైరల్.. ఏం జరిగిందంటే?

King Mswati III ప్రస్తుతం స్వాజిలాండ్ రాజుకు 15మంది భార్యలు ఉండగా.. అతని తండ్రి, రాజు సోభూజా II కు 125 మంది భార్యలు ఉన్నారట.

King Mswati III

Africa King Mswati III : ఆఫ్రికాకు చెందిన ఎస్వాటినీ (స్వాజీలాండ్) దేశం రాజు మస్వాతి IIIకి 15మంది భార్యలు. అయితే, కొద్ది నెలల క్రితం ఆయన తన 15మంది భార్యలు, 100మంది సహాయకులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో యూఎఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌) కి వెళ్లారు. ఆ పర్యటనలో వారి 30 మంది పిల్లలు కూడా ఉన్నారు. మస్వాతీ III అబుదాబి విమానాశ్రయంలో అడుగు పెట్టడంతో అక్కడ హడావిడి మామూలుగా లేదు.

రాజు, ఆయన భార్యలు సంప్రదాయ వస్త్రధారణలో విమానం నుంచి దిగిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భారీ పరివారం కారణంగా ఆసమయంలో ఎయిర్ పోర్టులోని పలు టెర్మినళ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. అయితే, అప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Jubilee Hills by-election schedule : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోగిన నగారా.. నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీ.. పూర్తి వివరాలు ఇవే..

ప్రస్తుతం స్వాజిలాండ్ రాజుకు 15మంది భార్యలు ఉండగా.. అతని తండ్రి, రాజు సోభూజా II కు 125 మంది భార్యలు ఉన్నారట. అయితే, రాజుల విలాసవంతమైన జీవితంపై ఆ దేశంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు దేశ ప్రజలు దారుణమైన పేదరికంతో, ఆకలితో అల్లాడుతుంటే.. రాజు విలాసవంతమైన జీవితంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు రాజుతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రజలకు కనీసం కరెంట్, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. కానీ, రాజుకు మాత్రం ఈ రాజబోగాలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ఆకలితో ప్రజలు చనిపోతుంటే.. రాజు మాత్రం ప్రైవేట్ జెట్లలో షికార్లు కొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇంట్లో రాజు భార్యలందరికి సేవలు చేసేందుకు, వారి పర్యవేక్షణ చేసేందుకు ఎవరైనా సమన్వయకర్త ఉన్నారా అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తూ కామెంట్ చేశాడు.

ఆ రాజు ఆస్తి ఎంతంటే?
రాజు మస్వాతి 1986 నుంచి ఆ దేశాన్ని పాలిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం.. రాజు మస్వాతి వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు పైమాటే. ఆ దేశంలో ఆరోగ్యం, విద్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఇలా ఆ దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ జనాభాలో దాదాపు 60శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. 2021లో నిరుద్యోగం 23శాతం నుంచి 33.3శాతంకు పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. స్వాజిలాండ్ న్యూస్ ప్రకారం.. రాజు మస్వాతి ఆ దేశంలో నిర్మాణం, పర్యాటకం, వ్యవసాయం, టెలికమ్యూనికేషన్స్, అటవీ రంగాల్లోని పలు కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్నాడు. దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాజు రాజభోగాలపై ఆ దేశంలోనూ, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.