×
Ad

After Four Months First Sunrise : నాలుగు నెలల తర్వాత తొలి సూర్యోదయం..ఎక్కడో తెలుసా?

మైనస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగిసింది. నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత, అక్కడి మంచు కొండల మధ్యలోనుంచి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికాలో సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

  • Published On : August 23, 2022 / 07:42 AM IST

After four months first sunrise

After Four Months First Sunrise : సాధారణంగా ప్రతి రోజు సూర్యోదయం అవుతుంది. ఆకాశం మేఘావృతమైనప్పుడు సూర్యోదయం కనిపించదు. తుఫానులు, భారీ వర్షాల కురుస్తున్న సమయంలో నాలుగైదు రోజులు లేదా వారం రోజులపాటు సూర్యోదయం అవ్వదు. కానీ అక్కడ నాలుగు నెలల తర్వాత తొలి సూర్యోదయం అయింది. అదెక్కడ అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.

Antarctica India Scientist : అంటార్కిటికాలో కొత్త జాతి మొక్క

మైనస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగిసింది. నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత, అక్కడి మంచు కొండల మధ్యలోనుంచి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికాలో సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. తాము సూర్యోదయాన్ని చూసినట్లు కాంకోర్డియా పరిశోధనా స్టేషన్‌లోని 12 మంది సభ్యుల బృందం పేర్కొంది.