Bangladeshi Woman Sonia Akhtar
Bangladeshi Woman Sonia Akhtar : ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నోయిడాకు వచ్చిన సీమా హైదర్ ఉదంతం మరవక ముందే మరో బంగ్లాదేశ్ మహిళ తన కుమారుడితో కలిసి నోయిడా వచ్చిన ఘటన వెలుగుచూసింది. బంగ్లాదేశ్‌కు చెందిన సోనియా అఖ్తర్ అనే మహిళ తన కుమారుడితో కలిసి నోయిడాకు వచ్చింది. నోయిడా నివాసి సౌరవ్ కాంత్ తివారీ బంగ్లాదేశ్‌లో తనను వివాహం చేసుకున్నాడని, తమకు కుమారుడు ఉన్నాడని సోనియా పేర్కొంది. (Bangladeshi Woman Arrives In Noida)
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..నలుగురి మృతి
తివారీ బంగ్లాదేశ్‌లో పని చేసినపుడు తామిద్దరం ప్రేమించుకుని ముస్లిం సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత, ఇస్లాం మతంలోకి మారిన తివారీ ముఖ్యమైన పనిని పూర్తి చేసి తిరిగి వస్తానని వాగ్దానం చేస్తూ భారతదేశానికి వచ్చాడు. తివారీ తిరిగి రాకపోవడంతో సోనియా అతని మొబైల్ ఫోన్‌ల ద్వారా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సీమ హైదర్ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని, (Pakistani Bhabhi Seema Haider) సోనియా(Sonia Akhtar) వీసా సహాయంతో భారతదేశానికి రావాలని నిర్ణయించుకుంది.
Luna-25 Moon Mission Crash : లూనా-25 క్రాష్ తర్వాత ఆసుపత్రిలో చేరిన రష్యా టాప్ సైంటిస్ట్
సోనియా అఖ్తర్ నోయిడాకు చేరుకోగానే, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సెక్టార్-62లోని డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. అనంతరం నోయిడా పోలీస్ కమిషనరేట్‌లోని మహిళా విభాగం తివారీ, సోనియాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తన భర్త తనతో పాటు బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని, లేదంటే తాను భారత్‌లో తివారీతోనే ఉంటానని సోనియా చెప్పింది. మొత్తం మీద ప్రేమికుల కోసం విదేశీ వనితలు భారతదేశానికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.