Fake GPS signals: దారితప్పుతున్న విమానాలు..! నకిలీ జీపీఎస్ సిగ్నల్స్‌తో ఇరాన్ గగనతలంలోకి.. అలా ఎందుకు జరుగుతుందంటే?

ఇటీవల ఇరాన్ సమీపంలోని 12 విమానాలకు నావిగేషన్ పూర్తిగా విఫలమయ్యాయని ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాప్ట్ సెక్యూరిటీ గ్రూప్ తెలిపింది.

Fake GPS signals

Airline Corporate Jets Target With Fake GPS Signals: నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ కారణంగా విమానాలు దారితప్పుతున్నాయి. సుమారు 20 ఎయిర్ లైన్స్, కార్పొరేట్ జెట్‌లు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లాయి. గత పదిహేను రోజులుగా నకిలీ జీపీఎస్ సిగ్నల్స్‌తో విమానాల రాకపోకల్లో గందరగోళం నెలకొంటుంది. ఈ నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ భూమి నుంచి పంపబడుతున్నాయి. విమానం యొక్క నావిగేషన్ సిస్టమ్‌లోకి చొరబడి, అసలైన ఉపగ్రహ జీపీఎస్ సిగ్నల్స్‌ను తొలగిస్తూ విమానాలు దారి మళ్లేలా చేస్తున్నాయి. బోయింగ్ 777, 737, 747 విమానాలలో నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ కారణంగా దారిమళ్లాయి. 777 విమానం నకిలీ జీపీఎస్ కారణంగా దారితప్పి చాలాదూరం ప్రయాణించింది. విమాన పైలట్లు ల్యాండ్ చేయడానికి బాగ్దాద్ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ని సంప్రదించి సమయం ఎంత, మేము ఎక్కడ ఉన్నాము అని అడగాల్సి వచ్చింది.

Read Also : Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. రంగంలోకి ఎన్నికల కమిటీ సభ్యులు.. మోదీ రాకతో మరింత జోష్

ఇటీవల ఇరాన్ సమీపంలోని 12 విమానాలకు నావిగేషన్ పూర్తిగా విఫలమయ్యాయని ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాప్ట్ సెక్యూరిటీ గ్రూప్ తెలిపింది. ఈ మార్గంలో గగనతలంలో ఇబ్బందికరమైన సమస్య ఉత్పన్నమవుతోందని, నకిలీ జీపీఎస్ సిగ్నల్స్‌తో టార్గెట్ చేయబడుతున్నాయని, ఇది త్వరగా నావిగేషనల్ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందని ఓప్స్ గ్రూప్ ఒక హెచ్చరిక నోటీసులో పేర్కొంది. అయితే, తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ విమానం వాస్తవ స్థానాల నుంచి 69 మైళ్ల నుండి 92 మైళ్ల మధ్యలో ఉన్నట్లు స్పష్టంగా చూపించినట్లు ఓ నివేదిక పేర్కొంది.

Read Also : Kasireddy Narayan Reddy: కాంగ్రెస్‌లోకి ఖాయమా..? రేవంత్‌తో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ.. కేటీఆర్‌తో భేటీ అయిన రెండురోజుల్లోనే ఇలా..

ఈ ప్రాంతంలో జీపీఎస్ స్ఫూఫింగ్ చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే విమానం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించినట్లయితే అది కాల్చివేయబడే ప్రమాదంకూడా ఉంది. మరోవైపు విమానాల జీపీఎస్ సిగ్నల్స్ ట్యాంపరింగ్ జరగడం కొత్తేమీ కాదు. దాదాపు 10 ఏళ్ల నాటి సమస్య. అయితే, నకిలీ జీపీఎస్ సిస్టమ్ ద్వారా ప్రయాణికుల విమానాలను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.