America Voter ID Debate : ఇండియా తరహా ఓటర్ ఐడీ అమెరికా వల్ల అవుతుందా?

America Voter ID Debate : ఇండియా మాదిరిగా ఓటర్ ఐడీ సిస్టమ్ అమెరికాలో సాధ్యమేనా? ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్ చేశారు. భారత్ లాగే అమెరికాలో కూడా కామన్ ఐడీ ఉండాాలనే వ్యాఖ్యలపై వరల్డ్ వైడ్ బిగ్ డిబెట్ నడుస్తోంది.

America Voter ID Debate ( Image Credit : AI )

  • ఇండియా తరహా ఓటర్ ఐడీ సిస్టమ్ అమెరికాలో సాధ్యమా?
  • ఓటర్ ఐడీ అమల్లోకి తేవాలంటే ఎలాంటి రూల్స్ అవసరం
  • అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబేట్

America Voter ID Debate : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత తాజాగా ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. ఇండియాలో ఓటర్ ఐడీ కార్డు గురించిన కామెంట్ అది. దాని గురించి తెగ పొగిడేశారు. అసలు అమెరికాలో కూడా ఇలాంటి ఓ కామన్ ఐడీ ఉండాలని.. ఎన్నికలు అప్పుడు బాగా జరుగుతాయని తన సోషల్ మీడియా హ్యాండిల్.. ట్రూత్ లో పోస్ట్ చేశారు. అయితే, అసలు ఇండియా తరహాలో అమెరికాలో వర్కవుట్ అవుతుందా? భారత్ తరహా వ్యవస్థను అమెరికా కూడా అమలు చేయగలదా? చూద్దాం.

ఇండియాలో పౌరసత్వం ఆధారంగా ఓటరు నమోదు

భారత్‌లో ఓటరుగా నమోదు కావాలంటే వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అలాగే ఆ నియోజకవర్గంలో సాధారణంగా నివసిస్తూ ఉండాలి. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలను తయారు చేస్తుంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయొచ్చు. కేవలం ఓటర్ ఐడీ కార్డే చూపించాలని రూల్ లేదు.

అమెరికాలో కూడా పౌరసత్వం తప్పనిసరి.. కానీ..
అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో కేవలం అమెరికన్ పౌరులు మాత్రమే ఓటు వేయగలరు. అయితే, అందులో ఓ చిక్కు ఉంది. భారత్ తరహాలో దేశం మొత్తానికి ఒకే ఎన్నికల వ్యవస్థ.. ఓటర్ కార్డులు.. ఇలాంటి సెటప్ అమెరికాలో లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న 50 స్టేట్స్ లో ఎన్నికల నిర్వహణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసుకుంటుంది. ఓటరు నమోదు, గుర్తింపు పత్రాలు, ఓటింగ్ విధానాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన రూల్స్ ఉంటాయి.

Read Also : BC Reservations : బీసీలకు 34శాతం కోటా.. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన!

అమెరికాలో కూడా ఓటర్ ఐడీ తేగలరా?
తేవొచ్చు. కాకపోతే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. చాలా రూల్స్ మార్చాలి. చట్టాలు చేయాలి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన వ్యవస్థ తీసుకురావాలంటే సాధారణంగా:
1. కాంగ్రెస్ చట్టాన్ని ఆమోదించాలి.
2. అధ్యక్షుడు దానిపై సంతకం చేయాలి.
3. రాష్ట్రాలు ఫెడరల్ నిబంధనలను అమలు చేయాలి.
4. అయితే, ఆ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనా కాదా అన్నదానిపై కోర్టులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

అమెరికన్లు పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు, రాష్ట్రాల గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగిస్తారు. కాబట్టి ఒకే జాతీయ ఎన్నికల గుర్తింపు వ్యవస్థను రూపొందించాలంటే ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారీ స్థాయిలో సమన్వయం అవసరం.

ఫైనల్ గా ట్రంప్ చెప్పినట్టు దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ ఐడీ అనేది విధానపరంగా, రాజకీయంగా చర్చించదగినదే అయినప్పటికీ… భారత్ తరహా ఓటర్ ఐడీ వ్యవస్థను అమెరికాలో అమలు చేయడం మాత్రం చాలా కష్టం.