కవలల్ని పెళ్లాడిన కవలలు ఒకేసారి గర్భవతులయ్యారు..కవలలే పుట్టాలని కలలు
- nagamani
- Published On : August 20, 2020 / 02:48 PM IST
ప్రపంచంలో ఎన్నో వింతలు..విడ్డూరాలు. అటువంటి ఇద్దరమ్మాయిల కథకూడా చిత్రంగానే ఉంది. ఆ ఇద్దరు అమ్మాయిలు కవలపిల్లలు. అచ్చుగుద్దినట్లుగా ఉంటారు. కన్నవాళ్లు కూడా పోల్చుకోలేనంత పోలికలు వారివి. ఇది పెద్ద వింతేమీ కాదు. ఆ కవల అమ్మాయిలిద్దరూ వారిలాగానే మరో కవల అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయిలిద్దరూ సమరూప కవలలైన యువకులనే పెళ్లి చేసుకొని సెలబ్రిటీలుగా మారారు. నాటి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఇన్‌స్టాగ్రామ్’ను షేక్ చేస్తున్నారు.
అమెరికాకు చెందిన బ్రిటనీ, బ్రయానా డీన్ అక్కాచెల్లెలిద్దరూ సమరూప కవలలు. వారు వారికి తగిన జోడీ కోసం దేశమంతా గాలించి జోష్, జెరెమీ సాలియర్స్ అనే సమరూప కవల అబ్బాయిల్ని 2018 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు.
అప్పటి నుంచి వారు ఇంటర్నెట్‌లో సెలబ్రెటీలైపోయారు. ఈ జంటలను చూసిన వారంతా ‘అరే అద్దంలో చూసినట్లే ఉందే’ మరీ ఇంత టూమచ్ పోలికలా అంటున్నారు.
ఇప్పుడీ అమ్మాయిలిద్దరూ ఒకేసారి గర్భం దాల్చడంతో మరోసారి ఫేమస్ అయ్యారు. అంతేకాదు..ఒకే రోజు కవల పిల్లలకు జన్మనిచ్చి తమ వారసత్వాన్ని ఘనంగా చాటుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు. ఇన్ని వింతలు..విశేషాలున్న ఈ కవలల జంటల కోరిక తీరాలని కోరుకుందాం..ఆల్ ది బెస్ట్ ట్విన్స్..
