Video: భారతీయ స్నాక్స్ అనగానే ఘాటైన రుచి, మసాలా, విభిన్న టెక్స్చర్లు గుర్తుకొస్తాయి. క్రంచీ నామ్‌కీన్, భుజియా, రుచికరమైన క్రిస్ప్స్ తింటుంటే స్వర్గాన్ని తాకుతున్నట్లు ఉంటుందని చాలా మంది అంటుంటారు.
ఇప్పుడు ఈ స్నాక్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఫుడ్ వ్లాగర్ హ్యాలీ తొలిసారి భారతీయ స్నాక్స్ రుచి చూసి తన అభిప్రాయాలను పంచుకుంది.
ఆమె మిల్క్ బికిస్ ప్యాకెట్ తెరిచి పాల్లో ముంచి తిన్నది. అమెరికన్ నిల్లా వాఫర్స్‌తో వీటిని పోల్చింది. ఇవి సింపుల్‌గా చాలా బాగున్నాయని చెప్పింది. 10కి 7.8 రేటింగ్ ఇస్తానని చెప్పింది. తర్వాత లేస్ చిప్స్ ఇండియన్ మ్యాజిక్ మసాలా ఫ్లేవర్ తీసుకుంది.
“చాలా ఫ్లేవర్‌ఫుల్, మసాలా బాగా పట్టింది. లేస్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు ఎప్పుడూ రాలేదు. ఈజీగా 10కి 10 రేటింగ్ ఇవ్వచ్చు” అని అంది.
తర్వాత కచ్చా మ్యాంగో బైట్స్ తీసుకుని ఆమె తిన్నది. వీటిని ఆమె సరదాగా “చిన్న హార్ట్ క్యాండీలు” అని పిలిచింది. ఒకటి రుచి చూసింది. “చాలా తీపి, పులుపు కలిసిన రుచి, వేసవిని గుర్తు చేసే ఫ్లేవర్. 10కి 8.2 రేంటి ఇవ్వచ్చు” అని తెలిపింది. ఆపై నైస్ బిస్కెట్లు రుచి చూసింది. 10కి 8.9 రేటింగ్ ఇచ్చింది.
ఆమె 50-50 స్వీట్ అండ్ సాల్టీ బిస్కెట్లు కూడా ట్రై చేసింది. “వీటి టెక్స్చర్ నాకు చాలా నచ్చింది. లైట్‌గా ఉన్నాయి, బటరీగా ఉన్నాయి. 10కి 8.6 రేటింగ్ ఇస్తున్నాను” అని చెప్పింది. చివరగా లండన్‌బెర్రీ క్యాండీలు రుచి చూసింది. ఒక్క ముక్కతోనే “నైస్, తీపిగా ఉన్నాయి” అని చెప్పింది. ఈ స్నాక్‌కు 10కి 9 రేటింగ్ ఇచ్చింది.