Smart Watch Saves Man Life : గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌వాచ్‌..చావుబతుకుల్లో ఉన్న అతని ప్రాణం కాపాడింది

ప్రమాదానికి గురై రక్తపు మడుగులో చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణం కాపాడింది ఓ స్మార్ట్‌వాచ్‌. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన స్మార్ట్ వాచ్ అతని ప్రాణం కాపాడింది.

మనిషి..
ఇసుకలో సౌధాన్ని చూస్తాడు..
కరడు కట్టిన రాయితో శిల్పాన్ని చూస్తాడు..
లోహంలో ఆభరణాన్ని చూస్తాడు..
ఆకులో ఔషధాన్ని చూస్తాడు..
అద్దంలో అందాన్ని చూస్తాడు..
కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడడు..
మానవత్వాన్నిచూపించడు…

Apple Smart Watch Saves Man Life  : అని మరో ఘటన నిరూపించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి..రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మనిషి సాటిమనుషులు పట్టించుకోలేదు. కానీ..మనిషి తయారుచేసిన యంత్రం ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. బాధితుడి చేతికున్న ‘స్మార్ట్‌ వాచ్‌’ అతని ప్రాణాల్ని నిలబెట్టింది.గత సోమవారం (సెప్టెంబర్‌ 25,2021) సింగపూర్‌ అంగ్‌ మో కియో టౌన్‌ లో రాత్రి 7.30గంటలకు మహముద్‌ ఫిట్రీ అనే 24 ఏళ్ల యువకుడు వ్యక్తి బైక్‌ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి ర్యాష్ గా డ్రైవ్ చేస్తు వచ్చి మహముద్ వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయాడు. ఈ యాక్సిడెంట్‌ ను ఎవ్వరు పట్టించుకోలేదు. మనకెందుకులే అనుకున్నారో ఏమోగానీ..ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు.

కనీసం సాటి మనిషి ప్రాణాలు రక్షించటానికి ఓ ఐదు నిమిషాలు కేటాయించి ఆంబులెన్స్‌కు కాల్‌ చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు. రాత్రి ఏడున్నరకు జరిగిన ఈ యాక్సిడెంట్ అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.కానీ మనుషులు ఎవ్వరు పట్టించుకోకపోయినా బాధితుడి చేతికి ఉన్న ఓ స్మార్ట్ వాచ్ అతని ప్రాణం కాపాడింది.

Read more : Donate Kidneys : భర్తల కోసం హిందూ,ముస్లిం మహిళలు ఒకరికొకరు..కిడ్నీ దానాలు..మానవత్వమే తప్ప మతం లేదని నిరూపించిన అతివలు

ఫిట్రీ చేతికి ఓ స్మార్ట్‌వాచ్ ఉంది‌. ఈ వాచ్ లో కాల్స్‌కు, మెసేజ్‌లకు యూజర్‌ స్పందించకపోతే (కట్‌ చేయడం తప్పించి) ఆ వ్యక్తి ఆపదలోఉన్నట్లు గుర్తించి.. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లను అప్రమత్తం చేసే ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ప్రమాదాలకు గురైనప్పుడుగానీ..ఏదైనా బలమైన దెబ్బలుతగిలిన్పుడు గానీ..ఈ స్మార్ట్‌ వాచ్‌ నుంచి ‘ఫాల్‌ అలర్ట్‌’ మోగుతుంది. యూజర్‌ ఒకవేళ దానిని ఆఫ్‌ చేయకపోతే.. సదరు వ్యక్తి ఆపదలో ఉన్నట్లు ఈ వాచ్ నిర్ధారించుకుంటుంది. ఆ తరువాత వెంటనే అతని కాంటాక్ట్‌లో ఉన్న లిస్ట్‌కు కాల్స్‌, మెసేజ్‌లు పంపించి అలర్ట్ చేస్తుంది.

అటువంటి వాచ్ పెట్టుకోవటం వల్లే ప్రమాదం నుంచి ఫిట్రీ బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన 30 నిమిషాలకు స్మార్ట్‌ వాచ్‌లోని అలర్ట్‌ ద్వారా సమాచారం అందుకున్న సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికు తరలిచి చికిత్స అందేలా చేసారు. సాటి మనుషులు పట్టించుకోకపోయినా స్మార్ట్ వాచ్ వల్ల ఫిట్రీకి సరైన సమయానికి ట్రీట్ మెంట్ అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అలా సాటి మనుషులు పట్టించుకోకపోయినా ఓ స్మార్ట్ వాచ్ వల్ల ఫిట్రీ బతికిబయటపడ్డాడు. కాగా. ఫిట్రీ పెట్టుకున్న యాపిల్‌ 4 సిరీస్‌ వాచ్‌ను అతనికి గర్ల్‌ఫ్రెండ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిందట. ఆ స్మార్ట్ వాచే ఫిట్రీ ప్రాణాలు కాపాడటం విశేషం. టెక్నాలజీ మంచిదే..సరైన రీతిలో వాడుకుంటే. ఏది ఏమైనా యాపిల్‌ 4 సిరీస్‌ వాచ్‌ సో గ్రేట్ అబ్బా..దటీజ్ యాపిల్..

ట్రెండింగ్ వార్తలు