Simon Berger Art : గాజుని పగలగొడుతూ కళారూపాలు.. ఈ ఆర్టిస్ట్ టాలెంట్ చూస్తే భళా అంటారు

సున్నితంగా ఉండే గాజు ఫలకాలపై కళారూపాలు చెక్కడం అంటే ? పగిలిపోతాయి కదా అనుకోవచ్చు. సైమన్ బెర్గర్ అనే కళాకారుడి ప్రతిభ చూస్తే ఔరా అంటారు.

Simon Berger Art

Simon Berger Art : రాళ్లపై శిల్పులు అందమైన శిల్పాలు చెక్కుతూ ఉంటారు. కానీ గాజువంటి పదార్ధంపై కళారూపాలు చెక్కడం అంటే ? సున్నితంగా ఉండే గాజు పగిలిపోతుంది కదా.. అని అనుమానం వస్తుంది. సైమన్ బెర్గర్ అనే గాజు కళాకారుడు గాజుపై చెక్కిన అందమైన కళాఖండాలు చూస్తే అబ్బురపడతారు.

Anand Mahindra video : క్యారెట్‌ను క్లారినెట్‌గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబు

స్విట్జర్లాండ్‌లోని నీడెరోంజ్‌కి చెందిన గాజు కళాకారుడు సైమన్ బెర్గర్. గాజు మీద సుత్తి ఉపయోగించి రకరకాల శిల్పాలను చెక్కుతాడు. బెర్గర్ చిన్నతనంలో కార్పెంటర్‌గా పనిచేశాడట. సుత్తితో పాటు ఆ పని కోసం ఉపయోగించే పరికరాల పట్ల అతనికి అనుభవం ఉంది. వస్తువులను ఎలా సృష్టించాలనేది అతనికి అవగాహన ఉంది. ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా తానే సొంతంగా దేనినైనా సృష్టించే నైపుణ్యం ఉంది బెర్గర్‌లో.

Scrap Ambassdor : 1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు

బెర్గర్ గాజుపై మొట్టమొదట తన భార్య చిత్రాన్ని చిత్రించి ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అలా అతని ప్రయాణం మొదలైంది. సన్నటి గాజు పలకపై కాకుండా కాస్త మందంగా ఉన్న గాజును పగులగొట్టడం ద్వారా బెర్గర్ తన కళారూపాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఉపయోగించే సుత్తిని కాకుండా బెర్గర్ తన కళ కోసం ప్రత్యేకంగా సుత్తిని తయారు చేసుకున్నాడు. ఇప్పటికే అనేక చోట్ల తను తయారు చేసిన కళాకృతులతో  ప్రదర్శనలు ఇచ్చిన బెర్గర్ అనేకమంది ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతని ప్రదర్శన ‘ఫేసింగ్ గ్రేస్’ పేరుతో ట్రెవిసో సిటీ మరియు పోసాగ్నోలోని కానోవాలో జరుగుతోంది. డిసెంబర్ 15, 2023 లో మొదలైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 11, 2024 వరకు కొనసాగుతుందట. ఈ విషయాన్ని సైమన్ బర్గర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా పోస్టు చేసాడు. బెర్గర్ కళాకృతులు చూస్తే అద్భుతం అనక మానరు.