Earthquake In New Zealand : న్యూజిలాండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్పూర్న్ నగరంలో భూకంపం సంభవించింది.

Hurricane Gabriel (1)

Earthquake In New Zealand : న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్బోర్న్ నగరంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయింది. అంతకముందు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశ ప్రజలను సునామీ భయం వెంటాడుతోంది.

మరోవైపు గాబ్రియేల్ తుఫాన్ తో న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ వణికిపోతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులకు న్యూజిలాండ్ చిగురుటాకులా వణికిపోతోంది. ఆక్లాండ్ సహా పలు నగరాలు తుఫాన్ భారీన పడ్డాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

Gabriel Hurricane : న్యూజిలాండ్ ను వణికిస్తోన్న గాబ్రియేల్ తుఫాన్.. 46 వేల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

న్యూజిలాండ్ ఉత్తర ప్రాంతాల్లో 250 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడి వాహనాలు ధ్వంసమయ్యాయి. 46 వేల ఇళ్లకు విద్యత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు కూడా రద్దయ్యాయి. మొత్తం 509 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.