Guinness World Record : తలతో 273 వాల్నట్‌లు పగలగొట్టి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నెల్లూరు వాసి
గిన్నిస్ వరల్డ్ రికార్డు జాబితాలో వింత వింత ఫీట్లతో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తలతో 200 పైనే వాల్నట్‌లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
- Lakshmi 10tv
- Updated on- August 8, 2023 / 11:58 AM IST
Guinness World Record
Guinness World Record : ముక్కుతో టైప్ చేయడం.. బఠానీలు ఊదడం, పొట్టతో పుచ్చకాయలు పగలగొట్టడం.. ఇలాంటి వింత పనులే ప్రపంచ రికార్డులకెక్కాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకి చెందిన నవీన్ కుమార్ ప్రపంచ రికార్డు కోసం ఎలాంటి సాహసం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా తలతో 200 పైనే వాల్నట్‌లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
Highest Living Elephent : 103 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏనుగు .. వత్సలను వరించనున్న గిన్నిస్ రికార్డు
గిన్నిస్ యాజమాన్యం దగ్గర వింత వింత ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకి చెందిన నవీన్ కుమార్ ఒక నిముషంలో తలతో 273 వాల్నట్స్ పగలగొట్టి రికార్డు సాధించడం. అతను ఈ ఫీట్ చేస్తున్నప్పుడు రక్తం కారుతున్నా లెక్క చేయకుండా తన ఫీట్ కొనసాగించాడు.
గిన్నిస్ యాజమాన్యం ట్విట్టర్ ఖాతాలో (Guinness World Records) ‘కొత్త రికార్డు.. ఒక నిమిషంలో తలతో అత్యథికంగా 273 వాల్నట్‌లు పగలగొట్టిన ఎస్.నవీన్ కుమార్.. ఇండియా’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 30 న అతను ఈ విజయం సాధించాడట. గతంలో మార్షల్ ఆర్ట్స్‌లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ నవీన్‌కు ఉందని గిన్నిస్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన రికార్డుల వల్ల ఉపయోగం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు
