Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

ఆమెలో ఉన్న లోపాన్ని వేలాదిమంది బిడ్డలు బొజ్జలు నింపే వరంలా మార్చుకుంది. ఎంతోమంది చంటిబిడ్డల కడుపులు నింపింది. ఆ మాతృమూర్తి పెద్ద మనస్సుకు వరల్డ్ రికార్డు ఇచ్చి సత్కరించేలా చేసింది. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ అమ్మ గొప్పతనం ప్రపంచ రికార్డు సాధించింది.

Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

Elisabeath Mother Milk donation Ginnis Record

Elisabeath Mother Milk donation Guinness Record : అమ్మ పాలు అమృతం.. అద్భుతం.. ఆరోగ్యకరం.. అందుకే బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు పెట్టమని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంతమంది తల్లులు రకరకాల కారణాల వల్ల పిల్లలకు పాలిచ్చే అవకాశం కోల్పోతున్నారు.. అమెరికాలో ఓ తల్లిమాత్రం తన పిల్లలకే కాదు.. తల్లిపాలకు దూరమైన ఎందరో చిన్నారులకు తల్లిలా ఆదుకుంది. తల్లిపాలిచ్చి అమ్మగా మారింది. ఆమె చేసిన గొప్పసాయం ఇప్పుడు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు ఎక్కనుంది.

మనకు కనిపించే ప్రత్యక్ష దేవత అమ్మ. మనకు జన్మనివ్వడమే కాదు.. మంచి ఆరోగ్యం ప్రసాదిస్తుంది అమ్మే.. పుట్టిన వెంటనే తాగే మురిపాలే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుంటాయి. మాతృత్వం వరమని, దానితోనే పరిపూర్ణత సిద్ధిస్తుందని చాలా మంది తల్లులు నమ్ముతుంటారు. బిడ్డ పుట్టింది మొదలు ఐదేళ్ల వరకు తల్లి ఇచ్చే పాలే బిడ్డకు పౌష్టికాహారం.. అయితే కొందరు తల్లులు అనారోగ్య కారణవాల్లనో.. వీలుకాకో పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నారు. తల్లి పాలకు దూరమై చాలా మంది చిన్నారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి వారికి అమ్మలా ఆదుకుంటోంది అమెరికాకు చెందిన ఎలిసాబెత్‌ ఆండర్సన్‌ సియోర్రా అనే మాతృమూర్తి. తన ఇద్దరు బిడ్డలకే కాదు కొన్ని వేల మందికి మురిపాలు పంచిపెట్టిన దేవతగా ఆమెను గుర్తించింది గిన్నిస్‌ వరల్డ్ రికార్డు బ్యూరో. ఇది ఏ తల్లికి దక్కని అదృష్టం. ఏ తల్లి సాధించనలేని గొప్పదనం. ఏ తల్లీకి రాని అరుదైన అత్యద్భుతమైన అవకాశం. ఎలిసాబెత్ సాధించిన బ్రేకింగ్ తల్లిపాల దానం (through record-breaking donation)గురించి ఎంత చెప్పినా తక్కువే అనటంలో అతిశయోక్తిలేదు.

Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష

ఎలిసాబెత్‌ ఆండర్సన్‌(Elisabeth Anderson-Sierra)ను అమెరికా (America)లోని మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌(Mother Milk Bank)కు రెగ్యులర్‌ డోనర్(Mother Milk Bank)‌. సుమారు 16 వందల లీటర్ల చనుపాల(Mother Milk Bank)ను ఇప్పటివరకు దానం చేసింది ఎలిసాబెత్‌. హైపర్‌ లాక్టేసిన్‌ సిండ్రోమ్‌ (Hyper lactase syndrome)ద్వారా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఎలిసాబెత్‌ తనలో లోపం ఇతరులకు వరంగా భావించింది. హైపర్‌ లాక్టేసిన్‌ సిండ్రోమ్‌ వల్ల చను బాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఓ విధంగా మంచిదేనని భావించినా ఎలిసాబెత్‌ ఆండర్సన్‌.. తన పిల్లలతో పాటు మరికొందరు పిల్లలకు తల్లిపాలు పెట్టింది. గత తొమ్మిదేళ్లలో ఆమె సుమారు పది వేల లీటర్ల చనుబాలును పంచిపెట్టింది. అయితే ఆమెలో మాతృహృదయాన్ని గుర్తించిన మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ నిర్వహకులు.. ఈ విషయాన్ని గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు.

Diamonds Hunting : రతనాల సీమలో వజ్రాల సిరులు.. తొలకరిలో కోటీశ్వరులవుతున్న సామాన్యులు

తొమ్మిదేళ్లుగా నిరంతరాయంగా తల్లిపాలను దానం చేస్తున్న ఎలిసాబెత్‌ ఔదార్యాన్ని గుర్తించిన గిన్నిస్‌ నిర్వాహకులు.. 2015 ఫిబ్రవరి 20 నుంచి 2018 జూన్‌ 20 మధ్య కాలంలో ఆమె 16 వందల లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు గుర్తించి.. ఆమెను అభినందిస్తూ గిన్నిస్‌ రికార్డుల్లో ఎలిసాబెత్‌ పేరును లిఖించింది. అమెరికాలో నివసిస్తున్న ఎలిసాబెత్‌ తొలుత తన భర్త పనిచేస్తున్న ప్యూరెక్టికా వెళ్లారట.. అక్కడ పురిట్లోనే తల్లిని కోల్పోయిన చిన్నారికి పాలిచ్చారు ఎలిసాబెత్‌. ఇక అక్కడి నుంచి నిరంతరాయంగా తల్లి లేని పిల్లలకు.. తల్లిపాలు దక్కని చిన్నారులకు ఆదుకోడానికి ముందుకువచ్చారు. హైపర్‌ లాక్టేసిన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఎలిసాబెత్‌కు ప్రతి తొమ్మిది నిమిషాలకు పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ లోపం అనాథల పాటిల వరంగా మార్చేసిన ఎలిసాబెత్‌.. క్రమం తప్పకుండా మదర్‌ మిల్క్‌ బ్యాంకుకు పాలు అందజేస్తున్నారు.