Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష

బిడ్డకు అమ్మపాలను మించిన ఔషధం లేదు. అమ్మపాలను మించి ఆహారం లేదు.అటువంటి అమ్మపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడతాయి.

Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష

Breast Feeding Week

అమ్మపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడతాయి. తల్లి పాలు ప్రాధాన్యత కోసం ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అమ్మపాల వారోత్సవాలు కొనసాగనున్నాయి. దీంట్లో భాగంగా బిడ్డకు అమ్మ పాలు ఎంత శ్రేష్టమో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మపాలు బిడ్డకు రక్ష..బిడ్డకు పాలిచ్చే తల్లికి కూడా శ్రీరామ రక్ష. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు కాకుండా చేస్తుంది. బిడ్డకు పాలు ఇవ్వటం ద్వారా తల్లికి రక్ష..బిడ్డకు శ్రీరామ రక్ష.

అమ్మపాలు బిడ్డకు ఓ వరం, అత్యంత సురక్షితం,వీటిని మించి పౌష్టికాహారం బిడ్డకు లేనే లేదు. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా, వ్యాధుల్ని జయించేవారిగా ఉంటారనేది నిరూపించబడింది. అమ్మపాలు తాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందుతుంది. తల్లి పాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ఎన్నో లాభాలున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.? రోజుకు ఎన్నిసార్లు పట్టాలి.? ఎలా పట్టాలి.? తల్లిపాలు పుష్కలంగా ఉండాలంటే ఎక్కువ కాలం బిడ్డకు ఇవ్వాలంటే తల్లి ఏం తినాలి? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.? అవి ఎంత శ్రేష్టం? ఇలా చాలా అంశాలపై అవగాహన కల్పించటానికే ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్ధేశ్యం. తల్లిపాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఐసీడీఎస్‌ (Integrated Child Development Services)ఆధ్వర్యంలో వారోత్సవాలను ఆగస్టు 7వ తేదీ వరకు కోవిడ్‌–19 నేపథ్యంలో టీ శాట్‌ ద్వారా నిర్వహించనున్నారు.

బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. శుభ్రంగా ఎటువంటి క్రీములు సోకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8–10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటే బిడ్డకు రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టవచ్చు. అమ్మపాల వల్ల బిడ్డకు ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఆరోగ్య ఎదుగుదల సహయపడతాయి.

పాలిచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. కూర్చునే ఇవ్వాలి.

*పాలిచ్చే సమయంలో కెఫిన్‌ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై అవి ప్రభావం చూపుతాయి.

తల్లి ముర్రుపాలు బిడ్డకు తప్పనిసరి

*బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు.
*ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్‌ ‘ఏ’ ఉంటుంది.
*వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి.
*శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి.
*తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.
*బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్‌ నీళ్లు ఇవ్వడం చేయకూడదు.

తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే..
*గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు కూడా తగినంతగా తీసుకోవాలి.
*ఆహారంలో తీపి పదార్థాలు అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు తినాలి. అంటే స్వీట్లు వంటివికాకుండా..

బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల తల్లికి కలిగే లాభాలు..
*తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
*చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు.
*బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు.
*తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్‌ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది.
*తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.
*ఆరు నెలల వరకు రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.
*తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు.

తల్లిపాలతో బిడ్డకు ఉపయోగాలు..
*తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
*నాణ్యమైన ప్రోటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి.
*ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
*ఇందులోని లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
*తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారినుంచి కాపాడుతాయి.
*తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్‌ వంటి వ్యాధులు రావు.
*బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.

తల్లిపాలను మించి ఆహారం బిడ్డకు ఎక్కడా లేదు..
ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు. కాగా..కోవిడ్‌- 19 వేవ్ లు వేవ్ లుగా భయపెడుతున్న క్రమంలో అమ్మపాల గురించి అవగాహ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నారు.