‘ఆక్స్‌ఫర్డ్‌’లో ఆధార్‌ : చావల్‌,డబ్బా, హర్తాల్‌,షాదీ

  • Publish Date - January 25, 2020 / 04:32 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రఖాతి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో మరో  26 భారతీయ పదాలకు చోటు దక్కింది. దీంట్లో ఆధార్‌, చావల్‌ (బియ్యం), డబ్బా, హర్తాల్‌ (ధర్నా), షాదీ (పెండ్లి) వంటి పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌(ఓయూపీ) ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన పదాలను ప్రతీ సంవత్సరం ఎంపిక చేసి డిక్షనరీలో పొందుపరుస్తూ ఉంటుంది. 

ఈ క్రమంలో శుక్రవారం (జనవరి 24,2020) ‘ఆక్స్‌ఫర్డ్‌ అడ్వాన్స్‌డ్‌ లర్నర్స్‌ డిక్షనరీ’ పదవ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీంట్లో ఇంగ్లిష్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు భాషలకు చెందిన వెయ్యికి పైగా పదాలకు చోటు కల్పించింది. వీటిలో 26 భారతీయ పదాలకు చోటు దక్కింది. వీటిలో 22 పదాలు ప్రింట్ చేసిన డిక్షనరీలో కనిపిస్తాయని, మిగతావి ఆన్‌లైన్‌ డిక్షనరీలో కనిపిస్తాయని ఓయూపీ ఎండీ ఫాతిమా తెలిపారు. 

పైన  తెలిపిన పదాలే కాకుండా ఆంటీ, బస్టాండ్‌, డీమ్డ్‌ యూనివర్సిటీ, ఎఫ్‌ఐఆర్‌, వెజ్‌, నాన్‌వెజ్‌, రీడ్రెస్సల్‌, టెంపో, ట్యూబ్‌లైట్‌, వీడియోగ్రాఫ్‌ వంటివి పదాలు ప్రింట్ డిక్షనరీలో కనిపిస్తాయని, కరంట్‌, లూటర్‌, లూటింగ్‌, ఉపజిల్లా పదాలు ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో మాత్రమే కనిపిస్తాయని ఫాతిమా తెలిపారు. 
ఇలా మొత్తంగా చూసుకుంటే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో 384 భారతీయ పదాలకు చోటు దక్కింది. చాట్‌బోట్‌, ఫేక్‌ న్యూస్‌, మైక్రోప్లాస్టిక్‌ వంటి పదాలకు కూడా ఏడాది ఎడిషన్‌లో చోటు దక్కింది.