కరోనా నుంచి స్పీడ్ రికవరీకి యాంటీవైరల్ డ్రగ్ ఇదే

  • Publish Date - May 16, 2020 / 02:34 PM IST

ఇంటర్నేషనల్ టీం రీసెర్చర్స్ యాంటీ వైరల్ డ్రగ్  interferon(IFN) కరోనా నుంచి రికవరీ అవడంలో చాలా వేగవంతంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇమ్యునాలజీపై వెలువడిన ఓ జర్నల్ లో స్టడీని బయటపెట్టారు. interferon అనే డ్రగ్ వైరస్ క్లియరెన్స్ ను వేగవంతం చేయడమే కాక ప్రొటీన్లను హరించే స్థాయిని తగ్గిస్తుంది. 

ప్రతీ వైరస్ కు కొత్త యాంటి వైరల్ డ్రగ్ కనుగొనేదాని కంటే interferonను ముందుగా ప్రయోగించడం బెటర్ అని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ ప్రొఫెసర్, రీసెర్చర్ డా.ఎలీనర్ ఫిష్ అంటున్నారు. SARSను అరికట్టడంలో 2002, 2003లోనూ interferon డ్రగ్ ను వాడాం. ఈ డ్రగ్ ను కొన్ని సంవత్సరాల వరకూ వాడొచ్చని వైద్యులు చెప్పారు. 

సగటున ఏడు రోజుల్లో శ్వాస సంబంధిత సమస్యను తగ్గిస్తుందని కనుగొన్నారు. దాంతో పాటు రక్తంలోని ఇంటర్‌ల్యూకిన్-6, C-రియాక్టివ్ ప్రొటీన్, రెండు ప్రమాదకరమైన ప్రొటీన్లు COVID-19పేషెంట్లలో ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని వూహాన్ లో 77పేషెంట్స్ మీద జరిపిన స్టడీలో ఇదే తేలింది.

మరో ద లాంసెట్ అనే స్టడీలో రెండు వారాల యాంటీ వైరల్ థెరఫీ.. మూడు యాంటీ వైరల్ డ్రగ్స్ తో ట్రీట్‌మెంట్ అందించారు. COVID-19ను తగ్గించడంలో అవి కూడా బాగా పనిచేశాయి. ఈ ట్రయల్స్ లోనూ interferon BETA-1b, lopinavir-ritonavir డ్రగ్స్ వాడారు.