2030 నాటికి AIతో మనిషి జీవితకాలం పెరుగుతుందా.. వృద్ధాప్యం దరిచేరకుండా 200ఏళ్లు జీవించి ఉండొచ్చా..! సంచలన విషయాలు వెలుగులోకి..

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది.

Artificial intelligence

Artificial Intelligence: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది. తద్వారా మాన జీవితాలను మార్చేస్తోంది. ఈ ఏఐ పరిజ్ఞానంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అదే స్థాయిలో మానవాళికి ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని, మానవుడిలాంటి మేధస్సును సాధిస్తుందని గుగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధన అంచనా వేసింది. తాజా.. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ యొక్క సీఈఓ డారియో అమోడీ సంచలన విషయాన్ని చెప్పారు.

స్వి్ట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో.. ఏఐ కేవలం ఐదు సంవత్సరాలలో (2030 నాటికి) మానవుడు జీవించే కాలాన్ని రెట్టింపు చేయగలదని ఆయన పేర్కొన్నారు. అమోడీ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరించినట్లుగా.. మానవులు 150 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న తరువాత వృద్ధాప్యం యొక్క ప్రభావాలను అధిగమించగల శాస్త్రీయ పురోగతిని సాధిస్తారు. అంటే మానవులు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. అయితే, జీవశాస్త్రపరంగా సాధ్యం కాకపోవచ్చు అని ఆయన ఒప్పుకున్నారు.

20వ శతాబ్దంలో మనిషి జీవితకాలం దాదాపు రెండు రెట్లు పెరిగింది. అంటే 40 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలకు చేరింది. 21వ దశాబ్దంలో దాదాని రెట్టింపు చేసి 150 సంవత్సరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఎలుకల్లో గరిష్ఠ ఆయుర్ధాయాన్ని 25 నుంచి 50శాతం పెంచే మందులు ఇప్పటికే ఉన్నాయి. కొన్ని జంతువులు (ఉదాహరణకు కొన్ని రకాల తాబేళ్లు) ఇప్పటికే 200 సంవత్సరాలు జీవిస్తున్నాయని అమోడీ చెప్పుకొచ్చాడు.

2032 నాటికి ఏఐ వృద్ధాప్యంపై రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిది దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయగలిగే సామర్థ్యం, దెబ్బతిన్న ప్రాంతంకు నేరుగా మందులను అందించగల నానోబోట్‌లను ఉపయోగించడం ద్వారా. రెండోది ఏఐ ద్వారా మన మెదడులను క్లౌడ్‌కు బ్యాకప్ చేయగల సామర్థ్యం. మానవ మెదడు, అది ఎలా పనిచేస్తుందనే దానిగురించి మనకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నందున ఇది సాధ్యం కాకపోవచ్చునని అమోడీ చెప్పుకొచ్చాడు.

చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ మరియు బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఎస్. జే ఓల్షాన్స్కీ మాట్లాడుతూ.. ఏఐ మనిషి వృద్ధాప్య జీవ ప్రక్రియను మార్చగలదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. సరళంగా చెప్పాలంటే.. ఏఐ మానవ జీవితకాలాన్ని ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేసినప్పటికీ.. మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? ఈ వాదనలు ఎప్పుడైనా నిజమయ్యాయో లేదో చూడటానికి ఒక శతాబ్దం పాటు ధృవీకరణ, పరీక్షలు పట్టవచ్చు. నేడు, మానవులు చరిత్రలో ఏ సమయంలోనూ లేనంత ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కానీ, ఆ పరిమితిని దాటి విస్తరించడానికి అంచనాలు, ఆధారాలు ఏమీ లేవని అన్నారు.