‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్(PAP)తీసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం దానిని కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చైనాకు బోర్డర్ కావడంతో అక్కడి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ పీఏపీ అనుమతిచ్చే అధికారులకు కండిషన్లు పెట్టాలని నిర్దేశించారు.
‘భారత్‌లో కరోనా వైరస్ కేసులు నమోదవడమే కాదు.. రోజూ పెరుగుతూ వస్తున్నాయి. దీనిని బట్టే తెలుస్తుంది కరోనావైరస్ కేవలం టూరిస్టుల కారణంగానే వస్తుందని. ఇటీవల విదేశాలకు వెళ్లి భారత్‌కు వచ్చిన వాళ్లతోనే సంక్రమిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ కారణంగానే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.
ఈ నిర్ణయం ఇటీవల సిక్కిం విదేశీయులను అనుమతించబోమని ప్రకటించిన తర్వాత తీసుకోవడం విశేషం. భూటాన్ సైతం పరిస్థితులు చక్కబడేంత (2వారాల)వరకూ విదేశీ ప్రయాణికులకు అనుమతులు నిరాకరించింది.
చైనాలో డిసెంబరులో మొదలైన ఈ కరోనా పలు దేశాలకు పాకింది. లక్ష మందికి పైగా సోకిన కరనా.. 3వేల 500మందిని పొట్టనబెట్టుకుంది.