ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. అతి పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ హ్యూమన్ ట్రయల్స్ ను అమెరికాలో స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఒకేసారి 30వేల మంది యువకులు పాల్గొననున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కోసం శ్రమిస్తున్న వారిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ముందున్నారు. అమెరికాలో ఇది ఫైనల్ స్టేజ్ టెస్టు కాగా.. యూకేలో ప్రిలిమినరీ రిజల్ట్స్ ను వచ్చే నెల విడుదల చేయనుంది.
మిగిలిన కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉండగా.. AZD1222కు నాలుగు నెలల సమయం పడుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్.. ఇది సక్సెస్ అయిన వెంటనే ఆమోదం తెలిపేందుకు రెడీగా ఉన్నారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనౌన్స్‌మెంట్ వస్తుందని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే అది మూడో దశకు చేరుకుంది. ఇతర వ్యాక్సిన్ గ్రూప్ చివరి దశకు చేరుకుంది. ఇది కూడా అప్రూవల్ పొందుతుందని ఆశిస్తున్నామని సోమవారం ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
ట్రంప్.. ఈ వ్యాక్సిన్ నవంబర్ ఎన్నికల కంటే ముందే వస్తే తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.
ఆస్ట్రాజెనెకా మరో స్టేట్‌మెంట్లో సీఈఓ పాస్కల్ సోరియట్ వ్యాక్సిన్ రివ్యూ అనేది పొలిటికల్ ప్రెజర్ తో ముడిపడి ఉందని చెప్పింది. ‘సైన్స్, సొసైటీపై ఉన్న ఇంటరెస్ట్ అనే వాటిపైనే మా కమిట్‌మెంట్‌ను ఉంచాం. ఎటువంటి లోటుపాట్లు లేకుండా త్వరగానే ప్రోసెస్ చేస్తున్నట్లు చెప్పారు.
ఆస్ట్రాజెనెకా అనేది ఆక్స్‌ఫర్డ్ బయోమెడికా తో చేసుకున్న ఒప్పందాన్ని విస్తరిస్తూ.. వ్యాక్సిన్ మాస్ ప్రొడక్షన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. లండన్ కు చెందిన ఈ డ్రగ్ మేకర్ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా 3బిలియన్ డోసులు ఉత్పత్తి చేయాలని.