President Donald Trump అతని భార్య మెలానియా ట్రంప్ కు COVID-19 పాజిటివ్ వచ్చింది. అమెరికాలో వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి సీనియర్ సిటిజన్స్ ప్రాణాలు ప్రమాదకరంగా మారాయి. ఈ 10 నెలల కాలంలో ఇన్ఫెక్షన్ తాకిడి తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో పాటు.. 80 శాతం మంది చనిపోయారు. 65 ఏళ్లు అంతకంటే పైబడ్డ వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు చాలా తక్కువని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
ఈ పాయింట్ లో చూస్తే ట్రంప్ (74)ఏళ్ల వయస్సులో ఇన్ఫెక్షన్ కు గురవడంతో మహమ్మారితో పోరాడటం చాలా రిస్క్. దాదాపు కొవిడ్-19 పాజిటివ్ కు తోడు ఏ ఇతర ఆరోగ్య సమస్య అటాక్ అయినా దానిని ఎదిరించి పోరాడలేరు. అయితే ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని చూస్తే గత సమ్మర్ నుంచి బాడీ మాస్ ఇండెక్స్ లో ఒబెసిటీకి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి.
అదే COVID-19 రిస్క్ కారణంగా భయం పుట్టిస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు దీని నుంచి బయటపడటం అంత సాధారణ విషయం కాదని చెప్తున్నారు. ఈ వయస్సు వారిలో సమస్య అధికంగా ఉండటం మామూలే. కొద్ది నెలలుగా ఈ రిస్క్ ను తగ్గించడం ఎలా అనే దానిని నేర్చుకున్నారు. టెస్టింగ్ కెపాసిటీని పెంచుకున్నారు.
నిజానికి ఈ విషయంలో ట్రంప్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కేసులు కనుగొనగలిగితే. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి మానిటరింగ్ చేయవచ్చని తెలిసింది. కచ్చితమైన మందు అంటూ కొవిడ్-19కు లేకపోవడంతో రెమెడెసివర్ లాంటి మెడికేషన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీ బేసిస్ మీద జబ్బుకు ట్రీట్‌మెంట్ అందించగలుగుతుంది.
ఈ ఏజెన్సీకి స్టెరాయిడ్ వాడేందుకు ఆథరైజేషన్ కూడా ఉంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి మరేదైనా తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడేవారికి ఇలా చేయొచ్చు. ఆర్థికంగా బాగున్న దేశాలకు మాత్రమే హెల్త్ కేర్ సిస్టమ్ బాగుండి.. మరణాలను తగ్గించగలుగుతుంది.
ట్రంప్ విషయానికొస్తే.. భార్యభర్తలిద్దరూ సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. వారిలో ఏవైనా లక్షణాలు బయటపడతాయా అని డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నిలకడగానే ఉన్నారని ప్రెసిడెంట్ డాక్టర్ చెబుతున్నారు. వైరస్ తీవ్రం కాకుండా ఉండటానికి ఆరంభ దశలోనే యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకోవాలి. రెమెడెసివర్ వంటి వాటిని వాడటం ద్వారా స్టార్టింగ్ లోనే బయటపడొచ్చని చెబుతున్నారు.
ట్రీట్‌మెంట్ లేని మహమ్మారితో ట్రంప్ దంపతులు ఎలా పోరాడతారో చూడాలి మరి.