జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు జరిగి 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ రాజధాని మపుటోలోని జైలులో చోటుచేసుకుంది. ఆ దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రాఫెల్ తాజాగా దీనిపై ప్రకటన చేశారు.
మొజాంబిక్‌లో 2024, అక్టోబర్ 9న దేశ అధ్యక్షుడిని, రిపబ్లిక్ అసెంబ్లీలోని 250 మంది సభ్యులు, పది ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యులను ఎన్నుకునేందుకు సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు తెలుపుతూ దేశంలో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
మొజాంబిక్‌లోని అత్యున్నత న్యాయస్థానం మూడు రోజుల క్రితం ఎన్నికల విషయంలో తీర్పునిచ్చింది. ఈ ఎన్నికలలో ఫ్రెలిమో పార్టీ విజయం సాధించిందని స్పష్టం చేసింది. అయితే, ఓట్ల రిగ్గింగ్ జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
అల్లర్లను ప్రోత్సహిస్తూ జైలు వెలుపల నిరసనలు తెలిపారని అధికారిక పార్టీ అంటోంది. అందుకే జైలులో అల్లర్లు జరిగాయని చెబుతోంది. అయితే, ఆ నిరసనలకు, జైలులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధం లేదని అధికారులు అంటున్నారు. జైల్లో జరిగిన ఘర్షణలతో 1,534 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వారిలో 150 మందిని పోలీసులు తిరిగి అరెస్టు చేశారు.
Gossip Garage : సంధ్య ధియేటర్ ఇష్యూ చల్లబడుతోందా? కాంగ్రెస్ సర్కార్ మెల్లమెల్లగా మెత్తబడుతోందా?