Gossip Garage : సంధ్య ధియేటర్ ఇష్యూ చల్లబడుతోందా? కాంగ్రెస్ సర్కార్ మెల్లమెల్లగా మెత్తబడుతోందా?
ఇలా సీరియస్‌గా పీక్ లెవల్ తుపాన్‌గా కొనసాగిన సంధ్య ధియేటర్ ఘటన ఇప్పుడు తీరం దాటుతున్నట్లు కనిపిస్తోంది.

Gossip Garage Tollywood To Meet CM Revanth Reddy
Gossip Garage : మొన్న ఉన్న వేడి నిన్న ఉండదు. నిన్న ఉన్న రచ్చ ఇవాళ ఉండదు. ఇవాళ ఉన్నంత హడావుడి మరో రెండ్రోజులు అయితే ఉండదు. అది పొలిటికల్ ఇష్యూ అయినా..మరేదైనా ఘటన అయినా..డే బై డే సిచ్యువేషన్ ఛేంజ్ అవుతూనే ఉంటుంది. రెండ్రోజుల క్రితం వరకు పీక్ లెవల్‌లో ఉన్న సంధ్య థియేటర్ ఇష్యూ..స్లోగా తీరం వైపు దూసుకొస్తున్నట్లే కనిపిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పార్టీ..ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీ ఎవరి ఎత్తుల్లో వాళ్లున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో తగ్గిందెవరు.? నెగ్గిందెవరు.? వాట్ నెక్స్ట్.?
కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్..
15 రోజులుగా రాష్ట్రంలో ఒకటే హాట్ టాపిక్. అదే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళా స్పాట్‌లో చనిపోవడం.. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం..ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్..బెయిల్..రిలీజ్..ఇలా నేషనల్ టాపిక్ అయిపోయింది. తర్వాత నోటీసులు..పోలీస్ విచారణ అంటూ డైలీ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతోన్న పరిణామాలు కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్‌గా మారాయి.
అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్‌కు ఇండైరెక్టుగా కౌంటర్ ఇవ్వడంతో వ్యవహారం మరింత సీరియస్ అయ్యింది. అయితే రోజులు గడుస్తున్నా కొద్ది..ఈ ఇష్యూ మెల్లిగా చల్ల బడుతున్నట్లు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం నుంచి..ఇటు సినీ ఇండస్ట్రీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి సమస్యను కొలిక్కి తెచ్చేలా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది.
Also Read : కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనా? ఈ నెల 30 తర్వాత అరెస్టులు ఉండబోతున్నాయా?
ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉందని భావన..!
అల్లుఅర్జున్ ఇష్యూలో అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్‌తో పాటు మిగతా పార్టీలన్నీ కామెంట్స్ చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు అపోజిషన్ లీడర్లు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో..కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కొందరు నేతలు అల్లుఅర్జున్‌తో పాటు సినీ ఇండస్ట్రీపై అగ్రెసివ్‌గా మాట్లాడిన తీరుపై పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారట. పాపులర్ సినీ హీరో కావడంతో వారి అభిమానులతో పాటు ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట.
అల్లుఅర్జున్ ఎపిసోడ్‌లో కాస్త వెనక్కి తగ్గడం బెటరనే ఆలోచనకు ప్రభుత్వ పెద్దలు వచ్చారట. అల్లుఅర్జున్ ఇష్యూలో ఇక నుంచి ఎవరూ అగ్రెసివ్‌గా మాట్లాడొద్దని, విమర్శలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టొద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారట.
రేవతి ఫ్యామిలీకి రూ.2 కోట్ల సాయం..
ఇక అటు అల్లుఅర్జున్ ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీ కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో పడింది. మరోవైపు జైలు నుంచి రాగానే అల్లుఅర్జున్ ఇంటికి క్యూకట్టి పరామర్శించిన సినీ ఇండస్ట్రీ పెద్దలంతా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీరియస్ అయిన తర్వాత పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరోవైపు ఫిల్మ్ డెవలప్ మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. రేవతి కుటుంబాన్ని చికిత్స పొందుతున్న బాలుడిని ఆస్పత్రికి వెళ్లి అల్లు అరవింద్, దిల్‌రాజు పరామర్శించారు. 2 కోట్ల రూపాయల సాయం అందజేశారు.
సినీ ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని సీఎం ప్రకటించడంతో టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా దిల్‌రాజు నిర్మించిన గేమ్‌ఛేంజర్, సంక్రాతికి వస్తున్నాంతో పాటు బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ సంక్రాతికి విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశంతో పాటు బెని ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే చాలా నష్టపోతామని అంటున్నారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దిల్‌రాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై మ్యాటర్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా సీరియస్‌గా పీక్ లెవల్ తుపాన్‌గా కొనసాగిన సంధ్య ధియేటర్ ఘటన ఇప్పుడు తీరం దాటుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మెత్త బడుతుండగా.. అల్లుఅర్జున్ సహా టాలీవుడ్ అంతా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో తగ్గిందెవరు..నెగ్గిందెవరనేది మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Also Read : కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్.. ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారా?