Gossip Garage : కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనా? ఈ నెల 30 తర్వాత అరెస్టులు ఉండబోతున్నాయా?

అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకో వైపు కేటీఆర్‌ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.

Gossip Garage : కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనా? ఈ నెల 30 తర్వాత అరెస్టులు ఉండబోతున్నాయా?

Gossip Garage Formula E Car Race Case

Updated On : December 25, 2024 / 11:06 PM IST

Gossip Garage : ప్రపంచ స్థాయి రేస్. అంతే లెవల్‌లో వివాదం. ఏసీబీ కేసుతో మొదలై.. ఈడీ ఎంటరై.. సెన్సేషనల్‌గా మారింది ఈ కారు రేస్‌ కేసు. ఈ నెల 30 తర్వాత ఏం జరగబోతోంది. ఇప్పుడిదే తెలంగాణ గట్టు మీద ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. ఫార్ములా కారు రేస్ కేసులో కేటీఆర్ పాత్రపై దర్యాప్తు సంస్థలు ఏం తేల్చబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి అప్రూవర్‌గా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇక కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్‌ ఏం జరగబోతోంది.? కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారా? అరెస్టులు ఉండబోతున్నాయా?

ఫార్ములా ఈ కార్ రేస్ అంశం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్ రేస్‌ ఈవెంట్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని..రేవంత్‌ ప్రభుత్వం ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో ఎట్ ఏ టైమ్‌ రెండు సంస్థలు..దర్యాప్తు చేస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

Also Read : పబ్లిక్ ఈవెంట్స్ చేయడానికి భయపడుతున్న హీరోలు, నిర్మాతలు..

కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ?
ఫార్ములా ఈ కారు రేస్‌ ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసిన FIRలో కేటీఆర్‌ A-1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ-2గా ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. అయితే ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఏసీబీ వివరణ తీసుకుంది.

ఈ క్రమంలోనే అరవింద్ కుమార్ అప్రూవర్‌గా మారిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్ రేస్ నిర్వహణలో విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏం లేదని..అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నానని అరవింద్ కుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పేరును ఏ-1గా చేర్చిందని అంటున్నారు.

Formula E Car Racing Case

Formula E Car Racing Case

అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. పైగా ఈ కారు రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, ప్రభుత్వానికి లాభమే జరిగింది తప్ప నష్టం జరగలేదని అంటున్నారు. ఇందులో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు ఈ కేసులో ఏ-2గా ఉన్న అరవింద్ కుమార్ అప్రూవర్‌గా మారారన్న సమాచారంతో వ్యవహారమంతా కేటీఆర్ చుట్టూ తిరగబోతోందన్న చర్చ మొదలైంది.

ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్?
ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం జరిగినా అంతా కేటీఆర్ ఆదేశాలతోనే చేశామని అరవింద్ కుమార్ చెప్పడంతో ఉచ్చు ఇప్పుడు కేటీఆర్ మెడకు బిగుస్తోందని అంటున్నారు. అరవింద్ కుమార్ అప్రూవర్‌గా మారారన్న టాక్‌తో కేటీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్‌కు కూడా కేటీఆరే టార్గెట్ కావడం.. అందుకు అనుగుణంగానే అరవింద్ కుమార్ అప్రూవర్‌గా మారడంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠకు దారి తీస్తోంది.

Formula E Race Case

Formula E Race Case

ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు దానకిషోర్‌ను ఏడు గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకుని ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్నారు. ఇక స్టేట్‌మెంట్‌ ఆధారంగా మాజీమంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలు పెట్టనుంది. త్వరలో కేటీఆర్‌, అరవింద్‌ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిశోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. అలాగే దానకిశోర్‌ ఇచ్చిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్‌ను వాళ్ల ముందు పెట్టి ప్రశ్నిస్తారని అంటున్నారు.

ఈ నెల 30 తర్వాత అరెస్టులు?
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా..? అనే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ అటు ఏసీబీ ఇటు ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకో వైపు కేటీఆర్‌ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఈ నెల 30 తర్వాత అరెస్టులు కూడా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం ఖాయం.

 

Also Read : కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్‌.. ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారా?