Covid Hospital Fire : కొవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది సజీవదహనం

కరోనా ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది మంటల్లో సజీవదహనమయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

At Least 44 Killed, 67 Injured In Coronavirus Hospital Fire In Iraq

coronavirus hospital fire : కరోనా ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది మంటల్లో సజీవదహనమయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్‌-హుస్సేన్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలడంతో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ టీం ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.

ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆవరించడంతో కొవిడ్‌ వార్డుల్లో బాధితులంతా చిక్కుకున్నారు. బాధితులు బయటకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏప్రిల్‌లో కూడా కొవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న 82 మంది కరోనా బాధితులు చనిపోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఇరాక్‌ 14 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. 17,000పైగా  కరోనాతో మృతిచెందారు.