New Born Babies: కరోనా సమయంలో పుట్టిన పిల్లల్లో IQ బాగా తక్కువ

కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు.

Babies Born: కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు లేవు, ఆటలు లేవు.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అంతేకాదు కరోనా సమయంలో పుట్టిన శిశువుల ఇంటిలిజెన్స్ విషఝయంలో మాత్రం కాస్త తక్కువగా ఉంటారని ఓ అధ్యయనం చెబుతుంది. కోవిడ్-19 సమయంలో పుట్టిన శిశువులు కాస్త ఇబ్బందిగా ఉంటారని, తెలివి విషయంలో వెనకబడే అవకాశం ఉందని అంటున్నారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో జన్మించిన పిల్లల తెలివితేటలు గణనీయంగా ప్రభావితం అయినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గర్భంలో ఉన్న సమయంలో ఎక్కువగా లాక్‌డౌన్‌ ఉండడం వల్ల వారి వికాసంపై ప్రభావం పడిందని చెప్పారు. రోడ్ ఐలాండ్‌లో జన్మించిన 672 మంది పిల్లలు, 188మంది మహమ్మారి సమయంలో (జూలై 2020 తర్వాత), 308 మంది (2019 జనవరికి ముందు) జన్మించారు. వారిలో 176 మంది లాక్‌డౌన్ ప్రారంభ దశలో జన్మించారు. (2019 జనవరి మరియు మార్చి 2020 మధ్య). మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలు ముందు జన్మించిన వారి కంటే తక్కువ IQలను కలిగి ఉన్నట్లు వారు కనుగొన్నారు.

లీడ్ స్టడీ రచయిత, బ్రౌన్ యూనివర్శిటీ పీడియాట్రిక్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ సీన్ డియోని ట్రెండ్ గార్డియన్‌తో ఈ విషయాన్ని చెప్పారు. ఈ సమయంలో తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవడం.. కలవరపడడం కూడా కారణం అని చెప్పారు. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ సరిచేసే సామర్థ్యం పెంచాలని, వారి విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలు చెయ్యాలని చెబుతున్నారు. శిశువుల మానసిక పురోగతిలో కీలకమైన సమయంలో ఒంటరితనం నష్టాన్ని కలిగించిందని వారి అధ్యయనంలో వెల్లడైంది. కరోనా, లాక్‌డౌన్ అనే విషయాలు కొత్తవి కావడం, వాటి వల్ల ఒత్తిడికి లోనవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వారు చెబుతున్నారు. తక్కువ ఆర్థిక భద్రత కలిగిన కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యారని పరిశోధకులు గుర్తించారు.

మహమ్మారి ఎంతోమంది ఆర్థిక, ఉపాధి మరియు ఆరోగ్యాలను ప్రభావితం చేసింది. కాబట్టి తక్కువ సామాజిక ఆర్థిక కుటుంబాల పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యారంటే ఆశ్చర్యపోనవసరం లేదని యూనివర్శిటీ కాలేజ్ లండన్ చైల్డ్ హెల్త్ ప్రొఫెసర్ సర్ టెరెన్స్ స్టీఫెన్సన్ గార్డియన్‌తో చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు