ఓ ఎంటర్‌ప్రైజింగ్ బేకరీ మహిళల మూత్రం ఉపయోగించి బ్రెడ్ తయారుచేస్తుంది. ఇది చాలా విలువైన బ్రెడ్ అని పబ్లిక్ టాయిలెట్స్ నుంచి సేకరించి తయారీలో వాడుతున్నారు. లూయీస్ రాగెట్ అనే ఇకో-ఫెమినిస్ట్ మహిళల మూత్రంతో గోధుమలను పెంచి.. దాంతో గోల్డీలాక్స్ బ్రెడ్ ను తయారుచేస్తుంది. పైగా యూరిన్ అనేది గొప్ప ఎరువు అని చెప్తుంది.
మూత్రంలో ఉండే పోషకాలు వృథాగా పోనివ్వకుండా ఫుడ్ సైకిల్ మెయింటైన్ చేయాలని ఆమె ఉద్దేశ్యమట. మహిళల రెస్ట్ రూంల నుంచి మూత్రాన్ని సేకరించి.. గోధుమలపై జల్లుతుందట.
‘అది వృథాగా వదిలేసిన ద్రవం. అందరూ చెత్త కింద వదిలేస్తారు. దానిని బంగారపు గనిలా భావించాలి’ అని రేగట్ అంటున్నారు. యూరిన్ లో నైట్రోజన్, పొటాషియం, ఇంకా చాలా న్యూట్రియంట్లు కూడా ఉంటాయని అవి భూమిలోని మట్టి నుంచి సేకరిస్తాయని చెప్తున్నారు. ఆమె పబ్లిక్ హెల్త్ తో ప్రయోగాలు చేస్తుందనుకోవడానికి లేదు. ఇలా యూరిన్ ను ఉపయోగించడానికి ఓ పద్ధతి ప్రకారం వెళ్తుందట.
ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ.. ప్రతి రోజు బ్రెడ్ తయారుచేయడానికి 703 టన్నుల నైట్రోజన్ అవసరం అవుతుందని.. ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ నుంచి ఇది వాడుకుంటున్నామని చెప్పింది. ఈ బ్రెడ్ బేకింగ్ ప్రోసెస్ గురించి ఆమె డైలీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో పంచుకుంటుంది.
యూరిన్ కనీసం 20సార్లు ఫిల్టర్ చేసి బ్రెడ్ ఫెర్టిలైజ్ చేయడానికి వాడతుందట. ఎకో-ఫెమినిజం నమ్మకాల కారణంగా మహిళల మూత్రాన్ని మాత్రమే పబ్లిక్ టాయిలెట్ల నుంచి సేకరించి వాడుతుందట.