‘Bald-Fest’ : బ‌ట్ట‌త‌ల ఉంటేనే ఆ ఫెస్ట్ కు ఎంట్రీ..

బట్టతల ఉందని బాధపడుతున్నారా? దిగులు పడిపోతున్నారా? మీరేం దిగులు పడనక్కరలేదు. మీలాంటివారు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. అటువంటివారి కోసమే బట్టతల ఫెస్టివల్.

‘The opposite of fashion week’:బట్టతల. ఈ మాట వింటే చాలు మగవారి గుండెలు గుభేలుమంటాయి. వెంటనే తల తడుముకుని తెగ దిగులుపడిపోతారు. అప్పటి వరకు హుషారుగా ఉన్నవారు కూడా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లుగా హైరానా పడిపోతారు.తలలోంచి నాలుగు వెంట్రులకు రాలిపడితే ..ఏదో జరగరానిది  జరిగిపోయినట్లుగా భయపడిపోతారు. నెత్తిమీదనుంచి రెండు మూడు వెంట్రుక‌లు ఊడితే చాలు.. వామ్మో.. బ‌ట్ట‌త‌ల వ‌చ్చేస్తుందా.. తెగ బాధ‌ప‌డిపోతారు.అందులోనూ పెళ్లికాని అబ్బాయిలైతే ఇక చెప్పనే అక్కరలేదు.పెళ్లికాదేమోనని భయపడిపోతారు.కానీ బ‌ట్ట‌త‌ల అనేది వ్యాధి కాదు..టెన్షన్స్, నిద్రలేమి ఉంటే జుట్టు ఊడిపోయే అవకాశాలుంటాయి.

 

అలాగే ప్రొటీన్స్ లోపం వ‌ల్ల కూడా జుట్టు ఊడుతుంది. బట్టతల వస్తే ఇక జీవితం అయిపోయిందన్నట్లుగా దిగులుపడిపోతారు.అదోరకంగా వేదనలో పడిపోతారు. జుట్టుకోసం ఆత్మవిశ్వాసాన్నే కోల్పోయేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటివారి కోసమే ‘బట్టతల పండుగ’ను సెప్టెంబర్ 13 న న్యూయార్క్‌లో నిర్వహిస్తారు.

ఈ బట్టతల ఫెస్టివల్ ను బ్రూక్లిన్ లోని రుబులాడ్ క్లబ్ లో జరుగుతుంది.ఈ ఫెస్టివల్ కు రావాలంటే బట్టతల ఉండాల్సిందే. బట్టతల ఉన్నవారికి మాత్రమే ఈ ఫెస్ట్ లోకి ఎంట్రీ. లేదంటే కుదరనే కుదరదు. ఈ ఫెస్ట్ కు రావాలంటే ఏదో ఫ్రీగా వచ్చేయటం కాదు. ఎంట్రీ ఫీజుకూడా ఉంటుంది.రూ.18 డార్లు ఎంట్రీ ఫీజు చెల్లించి రావాలి. ఏదో వచ్చామా?వెళ్లామా?అన్నట్లుగాకాకుండా బట్టతల ఎందుకు వస్తుంది? బట్టతల వచ్చినంతమాత్రాన నిరుత్సాహ పడిపోకుడదనీ..ఆత్మవిశ్వాసం మనిషిలోఉండాలి తప్ప జుట్టుతో కాదని కొంతమంది బూస్టింగ్ స్పీచ్ లిస్తారు. బట్టతల అనేది శాపం కాదు..అది వచ్చినంత మనకేమీ నష్టం జరుగదు అని చెబుతారు.

ఫ్యాష‌న్ వీక్ ఫెస్ట్‌ లు జరుగుతుంటాయి కదా..వాటికి పోటీగా ఈ బ‌ట్ట‌త‌ల ఫెస్ట్‌ను నిర్వ‌హిస్తుంటారు. ఈ ఈవెంట్‌లో బ‌ట్ట‌త‌ల ఉన్న‌వాళ్ల‌ను మోటివేట్ చేయ‌డంతో పాటు.. బ‌ట్ట‌త‌ల‌నే ఎలా స్ట‌యిల్‌గా చేసుకోవాలో చెబుతారు. అలాగే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది.పాటలు,డ్యాన్సులు, కామెడీ స్కిట్స్ ఇలా ఎంటర్ టైన్ మెంట్ కు కొదువే ఉండదు.

హా..అన్నట్లు ఈ బట్టతల ఫెస్ట్ ను యూఎస్ రాప‌ర్ ర‌మి ఈవెన్ ఎష్ ప్రారంభించారు. యూఎస్‌లో జుట్టురాలే స‌మ‌స్య రోజురోజుకూ పెరుగుతోంది. యూఎస్ మొత్తం మీద 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఈ జుట్టు రాలే స‌మ‌స్య‌ ఉందనీ..వారికి బ‌ట్ట‌త‌ల ఉన్న‌ట్టు నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్ వెల్ల‌డించింది.

ట్రెండింగ్ వార్తలు