×
Ad

Bangladesh Protests : ‘తగలబడుతున్న’ బంగ్లాదేశ్.. ఆందోళనలు హింసాత్మకం

Bangladesh Protests : బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కొందరు ఆందోళనకారులు ఆఫీసులపై

Bangladesh Protests

Bangladesh Protests : బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కొందరు ఆందోళనకారులు ఆఫీసులపై దాడులు చేసి, నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భయాకన పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read : IND vs SA : దక్షిణాప్రికాతో చివరి టీ20 మ్యాచ్.. టీమిండియాకు బిగ్‌షాక్.. కెప్టెన్ మార్పు చూపిస్తాడా..?

బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిస్టు నాయకుడు, రాజకీయవేత్త షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి రెచ్చిపోయారు. డిసెంబర్ 12న జరిగిన కాల్పుల్లో అతను గాయపడ్డాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. ఆయన మరణవార్త తెలియగానే రాత్రి నుంచి భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు తీవ్ర నిరసనలు చేపట్టారు. దీంతో ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

గురువారం రాత్రి రాజ్‌షాహీలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. చిట్టగాంగ్ మాజీ మేయర్ మొహియుద్దీన్ నివాసానికి నిప్పు పెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన ఆందోళనకారులు.. పలు మీడియా కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో మీడియా హౌస్‌లలోని రిపోర్టర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.


బంగ్లాదేశ్‌లోని అనేక ఇతర నగరాల్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిలో చిట్టగాంగ్ ఓడరేవు నగరం కూడా ఉంది. అక్కడ నిరసనకారులు భారత అసిస్టెంట్ హైకమిషన్ వెలుపల గుమిగూడి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజ్‌షాహిలో నిరసనకారులు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి, అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది.


తాజా పరిణామా నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయంకోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు.