కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో బోర్ ఫీల్ అవుతుంటారు. మరికొందరు కరోనా భయంతో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. వైరస్ ఎక్కడ సోకిందో లేదా సోకుతుందో అన్న భయంతో తమలో తామే మానసికంగా కృంగిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో ప్రతిఒక్కరి మనస్సును ప్రేరేపించేవి ఎంతో అవసరం.
మన మనస్సును జయించినప్పుడే ప్రతి ఒక్కటి జయించగలం.. మన మనస్సు చెప్పితే మనం నమ్ముతాం.. అందుకే హాలీవుడ్ ఎప్పుడూ మనుషుల సైకాలిజీపై ఎన్నో మూవీలు రూపొందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా కొందరిలో ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను సృష్టిస్తోంది. ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు హాలీవుడ్ లో దశాబ్దకాలంలో రిలీజ్ అయిన కొన్ని బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలను మీ కోసం అందిస్తున్నాం.. మీకు నచ్చిన మూవీలను చూసి ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేయండి..
1. Black Swan (2010) :
ఈ సైకలాజికల్ హర్రర్ మూవీని Darren Aronofsky అనే దర్శకుడు డైరెక్ట్ చేశారు. ఫిల్మ్‌లో నటీనటులుగా Natalie Portman, Vincent Cassel, Mila Kunis, Barbara Hershey, Winona Ryder నటించారు. ఈ మూవీలో Tchaikovsky నిర్మించిన Swan Lake ballet స్టోరీ చుట్టే తిరుగుతుంది. వైట్ స్వాన్, బ్లాక్ స్వాన్ ఒకే డాన్సర్ ప్రదర్శిస్తాడు. ఇందులో Nina (Portman) వైట్ స్వాన్ పాత్రలో ఒదిగిపోయారు.
బ్లాక్ స్వాన్ ప్లే చేయడానికి కొత్త dancer Lily (Kunis) సరిగ్గా సరిపోతుందని ఆమె టీచర్ చెబుతూ ఉండేది. అప్పుటి నుంచి ఆమెలో మానసికపరమైన మార్పులు కనిపిస్తాయి. తనకు తానే హాని చేసుకోవడం చేస్తుంటుంది. తాను చేసేది ఏది నిజమే ఏది అబద్దమే అర్థం చేసుకోలేదు. ఒకరకమైన భ్రమలో జీవిస్తుంది. ఫలితంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొందో మూవీలో చూడొచ్చు.
2. Shutter Island (2010)
దర్శకుడు Martin Scorsese ఈ మూవీని నిర్మించారు. Dennis Lehane’s 2003 novel ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో హాలీవుడ్ ప్రముఖ నటుడు Leonardo DiCaprio.. షట్టర్ ఐలాండ్‌లో సైక్రాయాటిక్ వార్డులో విచారించే U.S. Marshal Edward Daniels అధికారి పాత్రలో నటించారు. అందులో ఒక ఖైదీ అదృశ్యమైపోతాడు. అక్కడి నుంచే DiCaprio విచారణ ప్రారంభిస్తాడు. ఐలాండ్ లో చీఫ్ సైకాలిజిస్ట్ నిర్వహించే సంస్థలో మైండ్ కంట్రోల్ ప్రయోగాలు చేస్తుంటారు.
ఒక పేషెంట్ ను విచారించగా ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఇతర సభ్యులు తనను మానసికంగా వేధిస్తున్నారని చెబుతాడు. దాంతో తన మనస్సు కంట్రోల్ తప్పుతోందని అంటాడు. ఏదో తెలియని శక్తి తన మనస్సును లాగుతుందోని భయాభ్రాంతులకు గురిచేస్తోందని అంటాడు. ఇలాంటి మరెన్నో షాకుల నుంచి అతడు ఏం నేర్చుకున్నాడో కళ్లకు కట్టినట్టుగా మూవీలో చూపించారు. ప్రస్తుత రోజుల్లో బెస్ట్ సైకలాజిల్ థ్రిల్లర్ మూవీల్లో ఇదొకటిగా చెప్పవచ్చు.
3. Enemy (2013)
ఈ మూవీని దర్శకుడు Denis Villeneuve నిర్మించారు. José Saramago’s novel నేపథ్యంలో వచ్చిన The Double (2002) మూవీ నుంచి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ Enemy రూపొందించారు. ఇందులో Jake Gyllenhaal డబుల్ రోల్ చేశారు. వీరిద్దరూ ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. ఒకరు భౌతికంగా మరొకరు వ్యక్తిక్వ ప్రవర్తనలో మరొలా కనిపిస్తాడు. Adam Bell (Gyllenhaal) కాలేజీ హిస్టరీ ప్రొఫెసర్ గా కనిపించారు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఎ వే అనే చిత్రాన్ని అద్దెకు తీసుకుంటాడు. తన ఏజెంట్ తో కలిసి Jake ను ట్రేస్ చేసే చిన్న రోల్ ఈయనది.
అక్కడ అందరూ అతన్ని నటుడిగా నమ్ముతారు. ఆ తర్వాత అతడి మాయలో పడతాడు. అదే సమయంలో ప్రొఫెసర్ ప్రియురాలితో నిద్రించాలని కోరుతాడు. అందుకు ప్రొఫెసర్ కూడా అంగీకరిస్తాడు. అప్పటినుంచి వారిద్దరిలో గొడవకు దారితీస్తుంది. ప్రతీకారంగా, ఫ్రొఫెసర్ నటుడి స్థానంలోకి వెళ్తాడు. ఆ మోసాన్ని అతడి భార్య గుర్తిస్తుంది.. అయినా అతడితో నిద్రించేందుకు అంగీకరిస్తుంది. మరుసటి ఉదయం ఈ మూవీ స్టోరీ మరో మలుపు తిరుగుతుంది.
4. Gone Girl (2014)
ఈ సైకో థ్రిల్లర్ మూవీని David Fincher నిర్మించారు. ఒక నోవల్ ఆధారంగా Gillian Flynn నిర్మించిన మూవీ పేరుతోనే ఫించర్ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో Ben Affleck, Rosamund Pike, Neil Patrick Harris, Tyler Perry నటీ నటులుగా ఉన్నారు. Nick Dunne (Affleck) తన ఐదో వెడ్డింగ్ యానివర్శరీ రోజున Nick Dunne (Affleck) తిరిగి ఇంటికి వస్తాడు.
తన భార్య Amy (Pike) అప్పటి నుంచి అదృశ్యమవుతుంది. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో చిల్డ్రన్స్ బుక్స్ ద్వారా ఆమె ఒక చిన్న సెలబ్రిటీగా పాపులర్ అవుతుంది. ఆమె అదృశ్యంపై అన్ని మీడియాలో భర్త Dunne ఆమెను హత్య చేసి ఉంటాడని కథనాలు వస్తాయి. పోలీసులు అతన్నే అనుమానిస్తారు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుంది..
5. The Joker (2019)
ఈ మూవీని Todd Phillips అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. అత్యంత ప్రసిద్ధి చెందిన DC Comics villain ఆధారంగా ఈ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో Joaquin Phoenix అనే నటుడు జోకర్ గా నటించారు. 1981లో Arthur Fleck అనే కామిక్ వ్యక్తి పాత్రను పోషించారు. అతను పిచ్చివాడిలా మారిపోతాడు. పోలీసులను హత్య చేయడం ద్వారా అతని నేర ప్రవృత్తిని ప్రారంభిస్తాడు. అధిక నేరాలు, తక్కువ ఉపాధి రేటు ఉన్న నగరం అరాచక స్థితికి వెళుతుంది.
అతను బ్రూస్ వేన్ తండ్రి థామస్ వేన్ చట్టవిరుద్ధమైన బిడ్డ కావచ్చునని ఆమె అతనికి అబద్ధం చెప్పింది. నిజం తెలిసిన తరువాత అతను మరింత హింసాత్మకంగా మారుతాడు. పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. తనను ఎప్పుడూ ఎగతాళి చేసిన టాక్ షో హోస్ట్‌ను చంపేస్తాడు. పోలీసులు అరెస్టు చేసిన అతన్ని జోకర్ మాస్క్‌లు ధరించిన ఆర్మీ రాయిటర్స్ రక్షించింది. చివరకు మానసిక ఆశ్రయంకే పరిమితం అవుతాడు..