కరోనావైరస్ దెబ్బకు వాణిజ్య విమానయానం కుదేలైంది. కానీ, Alexey Isaykinకు చెందిన కార్గో క్యారియర్ Volga-Dnepr మాత్రం పూర్తి లాభాలతో జోరు మీదుంది. ఒకవైపు కరోనా ప్రభావంతో మార్కెట్లు పడిపోతే… Volga-Dnepr గ్రూపు మాత్రం ఈ ఏడాదిలో 3 వేలకు పైగా పందులను ఫ్రాన్స్ నుంచి చైనాకు రవాణా చేసింది. బోయింగ్ 747 కార్గో విమానంలో చెక్క డబ్బాలలో 6,450 మైళ్ళు (10,400 కిలోమీటర్లు) పందులను రవాణా చేసింది.
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభించి చైనాలో భారీ సంఖ్యలో పందుల మందను నాశనం చేసింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద జంతువుల పెంపకమైన చైనా పందుల మార్కెట్లో తీవ్ర కొరతను ఎదుర్కొంది. ఈ కొరతను తగ్గించడానికి స్థానిక పశువుల స్థాయిని పునరుద్ధరించడానికి వీలుగా ఫ్రాన్స్ నుంచి డ్రాగన్ తమ దేశానికి పందులను దిగుమతి చేసుకుంది.
కరోనావైరస్ వ్యాప్తి నివారణ చర్యలను కఠినతరం చేయడంతో పందుల కొరత ఎదురైంది. అప్పటినుంచి దేశీయ పందుల మంద జనాభాను పెంచే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. తద్వారా యూరప్‌ను అధిగమించి చైనా అతిపెద్ద పంది మాంసం సరఫరాదారుగా అవతరించింది. ఇప్పటికే 2019 మొత్తానికి చైనా కొనుగోలు చేసిన పంది మాంసం 245,000 టన్నుల కంటే ఎక్కువ అని చెప్పవచ్చు.
ఈ కార్గో Isaykin సంస్థ.. ఉపగ్రహాల నుంచి అత్యవసర వంతెనల వరకు అన్నింటినీ రవాణా చేసేందుకు మహమ్మారి సమయంలోనూ సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయంలో ఈ కంపెనీ మాస్క్‌లు, హజ్మత్ సూట్లు, వైద్య పరికరాలు, street-disinfecting వాహనాలను రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు కూడా రవాణా చేస్తోంది. Volga-Dnepr సేల్స్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 32శాతం పెరిగి 630 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.