Boris And Carrie Johnson : బ్రిటన్ ప్రధాని బోరిస్ దంపతులకు ఆడబిడ్డ
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(56) మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం లండన్ లోని ఓ హాస్పిటల్ లో బోరిస్ భార్య క్యారీ జాన్సన్ పండంటి ఆడపిల్లకు జన్మినిచ్చారు. కాగా, వారిద్దరికీ
- venkaiahnaidu
- Published On : December 9, 2021 / 04:44 PM IST
Uk
Boris And Carrie Johnson : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(56) మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం లండన్ లోని ఓ హాస్పిటల్ లో బోరిస్ భార్య క్యారీ జాన్సన్ పండంటి ఆడపిల్లకు జన్మినిచ్చారు. కాగా, వారిద్దరికీ ఇది రెండో సంతానం. తల్లి,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు బోరిస్ దంపతుల ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా,ఈ ఏడాది మే నెలలో బోరిస్ జాన్సన్.. తన ప్రేయసి క్యారీ సైమండ్స్(33)ను మూడో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే పెళ్లికి ముందే..2020 ఏప్రిల్ లో వీరికి ఒక మగబిడ్డ(విల్ ఫ్రెడ్) జన్మించాడు.
అయితే,అంతకుముందు బోరిస్ జాన్సన్ కు రెండు పెళ్లిళ్లు కాగా.. తనకు సంతానం ఎంతమంది అనేది చెప్పేందుకు బోరిస్ నిరాకరించారు. అయితే మరినా వీలర్ అనే ఓ లాయర్ తెలిపిన ప్రకారం.. బోరిస్ జాన్సన్..తన రెండో భార్య ద్వారా నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.
ALSO READ Bill Gates : కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పిన బిల్ గేట్స్..
