Bill Gates : కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పిన బిల్ గేట్స్..

కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పారు బిల్ గేట్స్..అప్పటి వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు.

Bill Gates : కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పిన బిల్ గేట్స్..

Bill Gates  Covid 19 Pandemic Will Be Over In 2022

Bill Gates  COVID-19 pandemic will be over in 2022 : కరోనా మహమ్మారికి గురించి మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిలియ‌నీర్‌ ఆసక్తికర విషయాలు మాట్లాడారు. కోవిడ్ ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేసి చెప్పారు బిల్ గేట్స్‌. పలు వేరియంట్స్ గా మారి భయపెడుతున్న కోవిడ్ తీవ్ర దశ ఎప్పుటి వరకు ఉంటుందో..ఎప్పుడు దాని తీవ్రత తగ్గుతుంది. దాని కోసం ప్రజలు ఏం చేయాలో..ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి పలు అంశాలపై తన బ్లాగ్ లు రాశారు.

2022లో కోవిడ్ మ‌హ‌మ్మారి తీవ్ర ద‌శ ముగుస్తుంద‌ని బిల్ గేట్స్ అంచ‌నా వేస్తు..ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఆందోళ‌న త‌ప్ప‌ద‌ని అన్నారు. ఈ ద‌శ‌లో మ‌రో సంక్షోభాన్ని అంచ‌నా వేయ‌లేమ‌ని..తీవ్ర ద‌శ 2022 ముగుస్తుందని తెలిపారు. కొన్ని ఏళ్లలో ప్ర‌తి సీజ‌న్‌లో కోవిడ్‌, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపారు. కోవిడ్ వైరస్ ఫ్య్లూ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాంతాకం అయినప్పటికీ వ్యాక్సిన్లు వేసుకుని..తగిన జాగ్రత్తలు తీసుకుంటు దాన్నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన పురోగతి గురించి ఆయన మాట్లాడుతు..కోవిడ్ కు కంటే వేగంగా ప్రపంచంలో ఏ వ్యాధికి ఇంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయలేదని అన్నారు. ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచం సిద్ధంగా ఉంద‌న్నారు. అయితే వ్యాక్సిన్ అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాగే కోవిడ్ మహమ్మారితో పాటు, సూయజ్ కాలువ వద్ద కంటైనర్ షిప్ చిక్కుకోవడం మరియు మొదటి మలేరియా వ్యాక్సిన్‌కు WHO ఆమోదం వంటి అనేక ఇతర అంశాల గురించి అతను రాసుకొచ్చారు బిల్ గేట్స్.