Ukraine,Russia Tortured Prisoners Of War : యుద్ధ ఖైదీల విషయంలో రష్యా,యుక్రెయిన్ చేసిన దారుణాలను బయటపెట్టిన ఐక్యరాజ్యసమితి

రష్యా,యుక్రెయిన్ రెండు దేశాలు యుద్ధఖైదీలను చిత్రహింసలు పెట్టే విషయంలో ఏమాత్రం ఒకదానికొకటి తీసిపోలేదని యుద్ధ ఖైదీలను వివస్త్రలుగా చేసి చిత్రహింసలు పెట్టిన దారుణాలను బయటపెట్టింది ఐక్యరాజ్యసమితి.

Ukraine,Russia Tortured Prisoners Of War : యుక్రెయిన్ పై రష్యా అత్యంత అమానవీయంగా..అనాగరిక యుద్ధం చేస్తోందని రష్యాపై పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. యుక్రెయిన్ కు మద్దతు తెలుపుతున్నాయి. అన్యాయంగా యుక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోందని ఆ దేశంపై విమర్శలు..ఈ దేశంపై జాలి చూపుతున్నాయి. కానీ యుద్ధ ఖైదీల విషయంలో రష్యాయే కాదు యుక్రెయిన్ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ..రెండు దేశాలు యుద్ధ ఖైదీల పట్ల ఎంత అమానవీయంగా..కర్కశంగా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నాయో వెల్లడించింది ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం..ఈ దారుణాలు వింటేనే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. రష్యాకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఉంది యుక్రెయిన్ కూడా..ఇరువైపులా 100 మందికి పైగా యుద్ధ ఖైదీలతో ఇంటర్వ్యూలు జరిపిన అనంతరం ఐరాస మానవహక్కుల కార్యాలయం ఈ విషయాలను బయటపెట్టింది.

తొమ్మిది నెలలకుపైనే అయ్యింది రష్యా యుక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి. ఈ యుద్ధంలో ఇరు దేశాలు అనేక మందిని యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుని డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉంచాయి. ఈ కేంద్రాల్లో రెండు దేశాలు ఖైదీలను చిత్రహింసలకు గురిచేశాయని ఐరాస దర్యాప్తులో వెల్లడైంది. ఖైదీలకు ఎలక్ట్రిక్‌ షాక్‌ లు ఇవ్వటం..వారిని నగ్నంగా చేసి మరీ ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వటం..వారిపై కుక్కలతో దాడులు చేయించటం.. లైంగిక హింసించటం వంటి అత్యంత దారుణాలకు యుక్రెయిన్ ఒడిగట్టినట్లుగా వెల్లడించింది.  యుక్రెయిన్ పాల్పడింది అంటూ యుక్రెయిన్‌ కేంద్రంగా పనిచేసిన ఐరాస బృందం జరిపిన దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలను బయటపెట్టింది.

రష్యాకు చెందిన డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉన్న యుక్రెయిన్‌ ఖైదీలను ఇంటర్వ్యూ చేయటానికి క్రెమ్లిన్‌ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఖైదీలు విడుదలైన తర్వాత ఈ బృందం వారిని ఇంటర్వ్యూ చేయటంతో ఈ దారుణాలు వెలుగు చూశాయి. అలా ఇరు దేశాలకు చెందిన 100మంది యుద్ధ ఖైదీలను ఇంటర్వ్యూ చేసింది యూఎన్ మానవహక్కుల కార్యాలయం.

2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత అనేక మంది కీవ్‌ (యుక్రెయిన్ రాజధాని) సైనికులను మాస్కో (రష్యా రాజధాని) బందీలుగా మార్చింది. వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు వార్తలు రావటంతో ఆ వార్తలకు రష్యా ఖండించింది. యుద్ధ ఖైదీలను చిత్రహింసలు పెట్టడమే యుద్ధ నేరం కిందకే వస్తుందని..దీనిపై దర్యాప్తు జరిపి న్యాయపరమైన చర్యలు చేపడుతామని అప్పట్లో యుక్రెయిన్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి చిత్రహింసలకు గురి అయిన కొంతమంది సైనికుల ఫోటోలను విడుదల చేసింది. ఆ ఫోటోలు చూసి రష్యా ఎంతటి కర్కశత్వంగా వ్యహరిస్తోందో అనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కానీ ఇటువంటి చర్యల్లో రష్యాకు యుక్రెయిన్ కూడా ఏమాత్రం తీసిపోలేదని తెలుస్తోంది యూఎన్ దర్యాప్తులో. యుక్రెయిన్‌ చెరలో ఉన్న రష్యా సైన్యంపైనా దారుణాలు జరిగినట్లు తేలడంతో ఈ విషయం తేటతెల్లమవుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు