నేను మీకు భయపడను.. ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ ప్రథమ మహిళ వార్నింగ్.. వీడియో వైరల్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై బ్రెజిల్ ప్రథమ మహిళ బంజా లులా డా సిల్వా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Brazil First Lady Insults Elon Musk

Brazil First Lady Insults Elon Musk : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై బ్రెజిల్ ప్రథమ మహిళ బంజా లులా డా సిల్వా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసభ్యకర పదజాలంతో మస్క్ పై విరుచుకుపడ్డారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ పై విమర్శలు చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి నియంత్రణలో ‘ఎక్స్’ విఫలమైందని ఆరోపించారు. ఆమె మాట్లాడుతున్న క్రమంలో హారన్ మోగింది.. దీంతో ఆమె.. ఇది ఎలాన్ మస్క్ అని నేను అనుకుంటున్నాను.. నేను నీకు భయపడను ఎలాన్ మస్క్.. అంటూ అసభ్యకర పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: హైప‌ర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం.. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్

మస్క్ స్పందిస్తూ..
బ్రెజిల్ ప్రథమ మహిళ చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఆమె మాట్లాడిన వీడియోకు ‘ఎక్స్’ వేదికగా నవ్వుతున్న ఎమోజీతో స్పందించారు. మరో పోస్టులో ఆమె బ్రెజిల్ లో వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతోంది అని రాసి ఉంది. గత సంవత్సరం కాలంగా మస్క్ సోషల్ మీడియా నెట్ వర్క్ ‘ఎక్స్’, బ్రెజిల్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికగా బ్రెజిల్ లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బ్రెజిల్ లో ఎక్స్ ఖాతాలను తొలగించాలని గతంలో అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డె మోరాసే ఆదేశించారు. వీటిని ఎలాన్ మస్క్ విస్మరించారు. దీంతో ఆ దేశంలో దాదాపు నెల రోజుల పాటు ‘ఎక్స్’ సేవలను నిలిపివేశారు. అంతేకాక.. కోర్టు ఆయనకు సుమారు రూ.43కోట్లు జరిమానాసైతం విధించింది.