Bridge Collapse: అయ్యయ్యో..! ప్రారంభిస్తుండగా కూలిన వంతెన.. మహిళను లాక్కొచ్చిన భద్రతా సిబ్బంది.. వీడియో వైరల్
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో ఓ వంతెను అధికారులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో బ్రిడ్జిపై ఉన్న అధికారులు వణికిపోయారు. బ్రిడ్జి రెండు ముక్కలయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harish Thanniru
- Updated on- September 7, 2022 / 01:08 PM IST
Bridge Collaps
Bridge Collapse: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో ఓ వంతెనను అధికారులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో బ్రిడ్జిపై ఉన్న అధికారులు వణికిపోయారు. ఒకరిని మరొకరు నెట్టుకుంటూ కూలుతున్న బ్రిడ్జి నుంచి బయటపడేలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై ఉన్న ఓ మహిళా అధికారిని భద్రతా సిబ్బంది నడుంపట్టుకొని లాగిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు.
Viral Video: రేషన్ తీసుకోవడానికి మెర్సిడెస్ జెంజ్లో వచ్చిన ‘పేదవాడు’
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వర్షాకాలంలో వరదలు కారణంగా వాగును దాటేందుకు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు విజ్ఞప్తుల అనంతరం అధికారులు ఆ ప్రాంతంలో చొన్నపాటి వంతెన నిర్మించారు. ఈ వంతెన పూర్తికావడంతో దానిని ప్రారంభించేందుకు అధికారులు వంతెనపైకి వచ్చారు. ఇందులో మహిళా అధికారికూడా ఉంది. మహిళా అధికారి రిబ్బన్ కట్ చేస్తున్న క్రమంలో బ్రిడ్జిపై జనం గుమ్మిగూడటంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్నవారంతా కిందపడకుండా తప్పించుకొనేందుకు ఒకరినొకరు నెట్టుకుంటూ పైకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా అధికారిని భద్రతా సిబ్బంది నడుంపట్టుకొని ఒక్కసారిగా లాగి సేఫ్ ప్లేసులో చేర్చారు. మిగిలిన వారు బ్రిడ్జి చిన్నగా కుంగిపోవడంతో కిందపడిపోయారు. ఈ బ్రిడ్జి రెండు ముక్కలుగా అయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Bridge collapses while being commissioned in DR Congo. pic.twitter.com/hIzwKWBx9g
— Africa Facts Zone (@AfricaFactsZone) September 5, 2022
బ్రిడ్జి ప్రారంభం రోజే ఇలా కుంగిపోవడంతో నిర్మాణ నాణ్యతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు నవ్వులు పూయిస్తూ రీ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ రిబ్బన్ ఒకదానితో ఒకటి వంతెనను పట్టుకున్నట్లుగా ఉంది అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. అందరూ తేలికైనోల్లే ఆ బ్రిడ్జిపై ఉన్నారు.. వ్యంగ్యంగా రీ ట్వీట్ చేశాడు.
