Viral Video: రేషన్ తీసుకోవడానికి మెర్సిడెస్ జెంజ్‭లో వచ్చిన ‘పేదవాడు’

జెంజ్‭లో రేషన్ తీసుకెళ్తోన్న పేదవాడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్త మీడియా వరకు వెళ్లడంతో రేషన్ దుకాణం నడుతుపున్న అమిత్ కుమార్‭ను మీడియా ప్రశ్నించింది. అయితే అతడు బీపీఎల్ కార్డు ఉందని, అది చూపించే రేషన్ తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక ఇది జెంజ్‭లో వచ్చిన సదరు వ్యక్తి వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్ గురించి తెలుసుకుని కాస్త ఆవేదన వ్యక్తం చేశాడు.

Viral Video: రేషన్ తీసుకోవడానికి మెర్సిడెస్ జెంజ్‭లో వచ్చిన ‘పేదవాడు’

man arrives ration shop in benz car in punjab

Viral Video: హెడ్డింగ్ చూసి బెంజ్ వేసుకుని వచ్చిన వ్యక్తి పేదవాడు ఎలా అవుతాడు? అనే ప్రశ్న రావొచ్చు. నిజానికి ఆ వ్యక్తి పేదవాడేనట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్తున్నాడు. బెంజ్‭లో కనిపించినంత మాత్రాన తనను డబ్బున్న వ్యక్తి అనుకోవద్దని, తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ రేషన్ షాపుకు బెంజ్‭తో వచ్చిన ఆ వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. పంజాబ్‭లోని హోషియార్‭పూర్‭లోని ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఆదింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగి తన బీపీఎల్ కార్డు (బిలో పావర్టీ లైన్) చూపించి గోదుమలు సహా ఇతర సరుకులు తీసుకున్నాడు. అనంతరం వాటిని కారు డిక్కీలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది.

Bengaluru Floods: బెంగళూరు కుండపోతపై సీఎం అత్యవసర సమీక్ష.. ఏమీ పట్టనట్లు నిద్రపోయిన మంత్రి

జెంజ్‭లో రేషన్ తీసుకెళ్తోన్న పేదవాడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్త మీడియా వరకు వెళ్లడంతో రేషన్ దుకాణం నడుతుపున్న అమిత్ కుమార్‭ను మీడియా ప్రశ్నించింది. అయితే అతడు బీపీఎల్ కార్డు ఉందని, అది చూపించే రేషన్ తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక ఇది జెంజ్‭లో వచ్చిన సదరు వ్యక్తి వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్ గురించి తెలుసుకుని కాస్త ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ బంధువులు విదేశాలకు వెళ్తూ తమ ఇంటి ముందు ఈ బెంజ్ కారును పార్క్ చేసి వెళ్లారట. ఖాళీగా ఉండడంతో తాను అప్పుడప్పుడు బయటికి తీస్తున్నానని, ఇందులో భాగంగానే రేషన్ దుకాణానికి వచ్చినట్లు పేర్కొన్నాడు. తాను పేదవాడినేనని, తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. అయితే ఇతడి వివరణను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. నెటిజెన్ల ఫోకస్ అంతా బెంజ్ కారు, రేషన్ దుకాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Cop Slaps Her Father-In-Law: మామ చెంపలపై కొడుతూ రెచ్చిపోయిన పోలీస్ కోడలు.. వీడియో వైరల్