Cop Slaps Her Father-In-Law: మామ చెంపలపై కొడుతూ రెచ్చిపోయిన పోలీస్ కోడలు.. వీడియో వైరల్

మామయ్య చెంపలపై కొడుతూ రెచ్చిపోయింది కోడలు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆ కోడలు నిర్వాకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమెపై పోలీసు అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. తన తల్లితో కలిసి మామయ్యతో గొడవ పడింది ఆ పోలీసు కోడలు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట తమ మామయ్యతో గొడవ పెట్టుకుంది కోడలు.

Cop Slaps Her Father-In-Law: మామ చెంపలపై కొడుతూ రెచ్చిపోయిన పోలీస్ కోడలు.. వీడియో వైరల్

Cop Slaps Her Father-In-Law

Cop Slaps Her Father-In-Law: మామ చెంపలపై కొడుతూ రెచ్చిపోయింది కోడలు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆ కోడలు నిర్వాకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమెపై పోలీసు అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. తన తల్లితో కలిసి మామయ్యతో గొడవ పడింది ఆ పోలీసు కోడలు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట తమ మామయ్యతో గొడవ పెట్టుకుంది కోడలు.

ఆమెకు ఆమె తల్లి కూడా మద్దతుగా నిలిచింది. తల్లీకుమార్తెలు ఇద్దరూ కలిసి వృద్ధుడిపై ఎగబడ్డారు. ఆ సమయంలో అక్కడ మరో పోలీసుల కూడా ఉన్నారు. చివరకు ఆ వృద్ధుడికి కోపం వచ్చి సోఫాలో నుంచి లేచినిలబడ్డాడు. ఆ సమయంలో ఆయన చెంపలపై కొడుతూ ఆ కోడలు రెచ్చిపోయింది.

దీంతో ఆమెను అక్కడ ఉన్న ఓ పోలీసుల అధికారి ఆపాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు ఆ పోలీసు కోడలిపై కేసు నమోదు చేయించారు. ఆ కోడలు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోందని చెప్పారు. ఆమెకు అత్తింటి వారితో గొడవలు ఉన్నాయని వివరించారు.

మామను కొట్టిన కోడలు