Queen Elizabeth II: బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్న వైనం.. వీడియో

బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II కన్నుమూయడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్‌హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదాయం ప్రకారం లండన్ లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ గేట్ల వద్ద వద్ద పుష్పాలు ఉంచి రాణి ఎలిజబెత్‌-IIకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. దీంతో ఎలిజబెత్‌-II కుమారుడు ఛార్లెస్ తన భార్య కెమిల్లాతో కలిసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌ బయటకు కారులో వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II కన్నుమూయడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్‌హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదాయం ప్రకారం లండన్ లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ గేట్ల వద్ద వద్ద పుష్పాలు ఉంచి రాణి ఎలిజబెత్‌-IIకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. దీంతో ఎలిజబెత్‌-II కుమారుడు ఛార్లెస్ తన భార్య కెమిల్లాతో కలిసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌ బయటకు కారులో వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

కొందరితో కరచాలనం చేశారు. అంతకుముందు వారిద్దరు స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోటలో గడిపి వచ్చారు. బాల్మోరల్ కోటలోనే ఎలిజబెత్‌-II కన్నుమూసిన విషయం తెలిసిందే. కొందరు ఛార్లెస్ చేతికి ముద్దులు పెట్టారు. ఓ వ్యక్తి ముందుకు దూసుకువచ్చి ఛార్లెస్ ను హత్తుకుని, ముద్దు పెట్టారు. ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ 10 రోజుల పాటు బ్రిటన్ పర్యటన చేపట్టనున్నారు.

ఆయన యూకే ప్రధాని లిజ్ ట్రస్ ను కలిసే అవకాశం ఉంది. ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బకింగ్‌హామ్ ప్యాలెస్‌ వద్ద ప్రజలు…

 

ట్రెండింగ్ వార్తలు