Kolkata Rasgulla : కలకత్తా రసగుల్లాకు బ్రిటీష్‌ హైకమిషనర్‌ ఫిదా..సూపర్ టేస్టీ అంటూ కితాబు

కలకత్తా రసగుల్లాకు బబ్రిటీష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ఫిదా అయిపోయారు. రసగుల్లాను రుచిచూశాను అని తన ట్విట్టర్ లో తెలిపారు.

British High Commissioner Tries Rasgulla In Kolkata

British High Commissioner tries rasgulla in Kolkata :భారతదేశం భిన్నమతాల కలయిక ఎలాగే విభిన్నమైన రుచులకు ప్రసిద్ధి కూడా. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక్కోరాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకమైన వంటకాలుంటాయి.అలాగే ఆ యా రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా పలు రకాలు వంటకాలు ఫేమస్ గా ఉంటాయి. అలా దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో రకాల వంటకాలు అద్భుతమైన టేస్ట్ తో ఆకట్టుకుంటాయి. ముంబై అంటే వడాపావ్, ఢిల్లీకి వెళ్తే చోలే భచూరా,చెన్నై మురుకులు, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, యూపీలోని బెనారస్‌ లస్సీ, అమృత్‌సర్‌ జిలేబీ, అహ్మదాబాద్‌ డోక్లా, తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి జిల్లాలో పూతరేకులు, కాకినాడ కాజా, బందరు లడ్డూ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అలాగే కలకత్తా అంటే కాళికా దేవి ఎంతగా భక్తిని కలిగిస్తుందో కలకత్తా రసగుల్లా కూడా చాలా ఫేమస్‌.

ఈ కలకత్తా రసగుల్లాకు బ్రిటీష్‌ హైకమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ఫిదా అయిపోయారు.ఇటీవల ఆయన కలకత్తా సందర్శించినప్పుడు ఆయన రసగుల్లా తిన్నారు. ఆ రుచికి ఆయన ఫిదా అయిపోయారు.ఆ రుచిని ఆయన మర్చిపోలేకపోయారు. కలకత్తా ఫేమస్‌ స్వీట్లలో ఒకటైన రసగుల్లా సూపర్ టేస్ట్ అంటూ పొగిడేశారు.

ఈ రసగుల్లా రుచి గురించి ఆయన ప్రత్యేకంగా చెబుతు ఆయన కలకత్తాలో మట్టి గిన్నెలో తిన్న రసగుల్లా ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘ఇండియాలోనే స్వీటెస్ట్‌ సిటీ అయిన కలకత్తాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీ దాస్‌ ఔట్‌లెట్‌లోని ఫేమస్‌ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచిచూశాను’ అని బెంగాలీ భాషలో రాశారు.చిరునవ్వులు చిందుస్తు మట్టిపాత్రలోని రసగుల్లాను తింటున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఈ స్వీట్‌ను రుచి చూడమనని రిఫర్‌ చేశారు కూడా.ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్లు, అభిమానులు మాత్రం కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.