Burj Khalifa
burj khalifa : అమెరికా (యూఎస్), ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. మిసైళ్ల వర్షం కురిపించాయి. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం ఆ ప్రాంతంలోని అమెరికన్ సైన్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అనేక వైమానిక దాడులు చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశమైన దుబాయ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం, దుబాయ్ గర్వకారణమైన బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
828 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ప్రతిష్టాత్మకమైన కట్టడం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడి నేరుగా బూర్జ్ ఖలీఫాను లక్ష్యంగా చేసుకొని జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మహా కట్టడంకు సమీపంలో దూసుకొచ్చిన మిసైల్ పడింది. అయితే, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అప్పటికే భవనాన్ని ఖాళీ చేయించారు. అయితే, బూర్జ్ ఖలీఫాకు సమీపంలో ఇరాన్ మిసైల్ దాడి కారణంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Drone attack on a building near Burj Khalifa, Dubai..#savas #Tehran #saldiri #طهران #امن_الخليج_خط_احمر pic.twitter.com/c3gitPDKt5
— Mufti Shamail Nadwi (@aqib_nasim__) February 28, 2026
దుబాయ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్లు ధాటికి భయానక వాతావరణం నెలకొంది. ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ప్రాంతంలో సంభవించిన పేలుడు కారణంగా ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. ఇరాన్ కు చెందిన షాహెద్ డ్రోన్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెండు భవనాల మధ్యలో కూలిపోయి భారీ పేలుడుకు కారణమైంది.