Car Parking: బాబోయ్.. కారు పార్కింగ్ ఇలాకూడా చేస్తారా? నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న ఇద్దరు మహిళల వీడియో..
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నవ్వులు పూయించే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు. అదే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
- Harish Thanniru
- Updated on- November 21, 2022 / 10:08 AM IST
Car parking
Car Parking: సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నవ్వులు పూయించే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు. అదే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇద్దరు మహిళలు కారును పార్కింగ్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి ఎట్టకేలకు కారును పార్కింగ్ చేసిన మహిళ.. మరో మహిళకు ఊహించని షాక్ ఇస్తుంది. ఈ వీడియో నెట్టింట్లో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
Growth In Children : పిల్లల్లో ఎదుగుదల కోసం ఈ పౌడర్ ను రోజుకు రెండు స్పూన్ లు తీసుకుంటే సరి!
ఈ వీడియోలో రోడ్డుపక్కన వరుసగా కార్లు పార్కింగ్ చేసిఉన్నాయి. అయితే, ఒకచోట ఓ కారుకు మరో కారు మధ్య గ్యాప్ ఉండటంతో ఆ స్థలంలో కారును పార్కింగ్ చేసేందుకు మహిళ యత్నించింది. ఆమె ప్రయత్నం విఫలం కావడంతో.. మరో మహిళ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు.. కారుదిగి పార్కింగ్ కు ఎంత ప్లేస్ ఉందో అడుగులతో కొలిచి మళ్లీ కారును పార్కింగ్ ప్రయత్నించింది. నానా తంటాలు పడిన అనంతరం ఎట్టకేలకు అనుకున్న ప్లేస్‌లో కారును పార్కింగ్ చేసింది. కారుదిగిన మహిళ.. వెనుకాలే ఉన్న మరోకారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
हर किसी को इस महिला की तरह होना चाहिए…#TrendingNow #Trending #viralvideos2022 #ViralVideo pic.twitter.com/5Irz8FpTv7
— Narendra Singh (@NarendraNeer007) November 19, 2022
మహిళ తీరుతో అవాక్కవ్వడం మరో మహిళ వంతయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. అసలైన ’కారు డ్రైవింగ్’ ఇలా చేయాలి కాబోలు అని ఓ నెటిజన్ రాయగా, ఈ మహిళ డ్రైవింగ్ లో మంచి ప్రావీణ్యం పొందినట్లుంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
