Ceos Are Getting Paid Bonuses Like There Was No Pandemic
CEOs paid bonuses: కరోనా వైరస్ పుణ్యమా అని మార్కెట్లు అన్నీ మూతపడి.. రెస్టారెంట్లు అనే ఊసెత్తడానికి అవకాశం లేకుండాపోయింది. అలా ఉన్నా కూడా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం తమ సీఈఓకు మల్టీమిలియన్ డాలర్ బోనస్ ను అప్పజెప్పింది.
KFC, Pizza Hutలతో పాటు Taco Bellలాంటి రెస్టారెంట్ బ్రాండ్ల సీఈఓ డేవిడ్ గిబ్స్ 2020 సంవత్సరంలో గతంలో కంటే 25శాతం తక్కువ మాత్రమే తెచ్చిపెట్టగలిగారు. దీనిపై బోర్డు డైరక్టర్లు సైతం సంతృప్తిగా లేదంటూ పెదవి విరిచారు. మహమ్మారి ప్రభావం కంపెనీల ఆర్థిక ఫలితాలపై గట్టి ప్రభావమే కనబరిచింది.
దీని ఫలితంగా కంపెనీ సున్నా డాలర్ల బోనస్ ఇవ్వడానికి బదులు .. 9.5 మిలియన్ డాలర్ల బోనస్ ను ముట్టజెప్పారు. ఈ గ్రూపు సంస్థలు ఒక్కటే కాదు అన్ని కంపెనీలు తమ ఆర్థిక సమస్యలను పక్కకుబెట్టి రివార్డులు ఇచ్చింది.