చిన్న పిల్లలు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎలాగైతే మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ్యనున్న పిల్లలు మాస్క్ లు పెట్టుకోవాల్సిందేనని వెల్లడించింది.
అలాగే 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్స ఉన్న వారు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ కంపల్సరీ అని WHO Website లో…United Nations Children’s Fund (UNICEF) ఓ డాక్యుమెంట్ పోస్టు చేసింది.
చిన్న పిల్లలకు మాస్క్ లు పెట్టాలా ? వద్దా ? అనేది ఆ ప్రాంతాల పరిస్థితిన బట్టి ఉంటుందని, కరోనా వైరస్ యొక్క తీవ్రత..తదితర కారణాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అనారోగ్యంతో ఉన్న పిల్లల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వారితో కలవనీయకపోవడం మంచిదని తెలిపింది.
ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, వారి సంరక్షణ కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని WHO, UNICEF వెల్లడించింది.