passenger carrying flying Air taxi
China Passenger Flying Air Taxi : ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రం లభించింది. ఎహంగ్ అనే చైనా కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసింది.
త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. కంపెనీ సీఈవో హుయాజీ హు మాట్లాడుతూ రానున్న ఐదేండ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలు అనేక నరగాల్లో కనపించనున్నాయని పేర్కన్నారు. తమ కంపెనీకి ఇప్పటికే 1200 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.