China Covid : చైనాలో కరోనా విలయతాండవం.. కొత్తగా 16వేలకు పైగా కేసులు, ఇదే అత్యధికం..!

China Covid : చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అతిపెద్ద నగరమైన వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా వైరస్‌ ఉద్ధృతి భారీగా పెరిగిపోతోంది.

China Covid : చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అతిపెద్ద నగరమైన వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా వైరస్‌ ఉద్ధృతి భారీగా పెరిగిపోతోంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే నమోదవుతున్నాయి. చైనాలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 4) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే వెలుగుచూశాయి. అయితే మంగళవారం (ఏప్రిల్ 5) కూడా చైనాలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 16,412 కొత్త రోజువారీ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇదే అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. 27 కన్నా ఎక్కువ చైనీస్ ప్రావిన్సులు, ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండటంతో చైనాలో కఠినమైన ఆంక్షలతో పాటు నగరవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది చైనా.

ప్రస్తుత కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారిన షాంఘై ఆర్థిక కేంద్రంలోనూ 26 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మార్చి 28న సిటీలో రెండు దశల లాక్‌డౌన్‌ను ప్రారంభించింది. కఠిన ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేస్తారో అధికారులు వెల్లడించలేదు. నగరంలో సోమవారం (ఏప్రిల్ 4) 8,581 లక్షణరహిత కరోనా కేసులు, 425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఇప్పటికే నగరంలో మోహరించిన 38వేల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులపై, షాంఘైకి సైన్యం, నేవీ జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుంచి 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని పంపింది. 2019 చివరిలో కరోనావైరస్ పుట్టిన వుహాన్‌లో కరోనా వైరస్ కేసుల తీవ్రత కంటే ఇదే చైనాలో అతిపెద్దదిగా పీఎల్ఏ తెలిపింది. చైనాలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వాలంటీర్లు మొత్తం జనాభాకు టెస్టులు నిర్వహించేందుకు, నిత్యావసర వస్తువులను సరఫరాకు భారీ అంతరాయం ఏర్పడింది. అధికారిక డేటా ప్రకారం.. షాంఘైలో నమోదైన కరోనా కేసుల్లో చాలామందిలో లక్షణరహితంగానే ఉన్నాయి.

China Covid China Reports 16,412 New Covid Cases, The Most Since Pandemic Began 

కరోనా కట్టడిలో డ్రాగన్ సైన్యం :
చైనాలో వాణిజ్య రాజధాని షాంఘైలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయి. అప్రమత్తమైన డ్రాగన్‌ సర్కారు.. షాంఘైలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది. చైనాలో గత కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ట్విన్‌ కొవిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. డ్రాగన్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. షాంఘై పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్‌ తదితర ప్రావిన్సుల నుంచి సిబ్బందిని నగరానికి పంపించారు.

Read Also :  CHINA COVID CASES : చైనాను వదలని కరోనా.. ఒక్కరోజే 13వేల కేసులు నమోదు.. కొత్త వేరియంట్ తో కలకలం 

ట్రెండింగ్ వార్తలు