కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షల మందిని బలితీసుకుంది. ప్రపంచ ప్రజలకు కంటి మీద
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షల మందిని బలితీసుకుంది. ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ చైనాలోని వుహాన్‌లో పుట్టిందనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. వుహాన్ లో కరోనా రావడానికి కారణం జంతువుల మార్కెట్ అనే విషయం కూడా ప్రపంచానికి తెలుసు. చైనా ప్రజలు అడ్డమైన జంతువులను, పురుగులను, కీటకాలను తింటుండటం వల్లే రకరకాల వైరస్‌లు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. 2019 డిసెంబర్‌లో వచ్చిన కరోనా వైరస్… మొదటిసారిగా వుహాన్‌లోని జంతువులు, పక్షుల మార్కెట్ నుంచే వ్యాపించిందనే వాదనా ఉంది.
చైనాలో కరోనా సెకండ్ వేవ్:
తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో మొదలైన సెకండ్ వేవ్ వెనక కూడా మరో జంతువుల మార్కెట్టే ఉందని తెలిసింది. ఎందుకంటే… బీజింగ్‌లో ఏప్రిల్ నుంచి గత వారం వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. చైనాలో దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. రీసెంట్ గా 100కు పైగా కొత్త కరోనా కేసులొచ్చాయి. వీటిలో 90శాతం కేసులు బీజింగ్‌వే. దీంతో బీజింగ్ లో భయాందోళనలు నెలకొన్నాయి.
కరోనా విజృంభణకు కారణం హోల్ సేల్ మార్కెట్:
సడెన్‌గా బీజింగ్‌లో కరోనా తీవ్రత ఎందుకు పెరిగిందనే అంశంపై పరిశోధన జరిపితే షాకింగ్ విషయం తెలిసింది. దీనికి కారణం బీజింగ్‌లోని జిన్ఫాడీ (xinfadi) హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్ అని తేలింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఫుడ్ మార్కెట్. ఫుడ్ అంటే చికెన్, మటన్ లాంటివి కాదు.. రకరకాల పురుగులు, తేళ్లు, పాములు, సముద్ర జీవులు, కూరగాయలు, జంతువుల మాంసం విక్రయించే ఆహార మార్కెట్. అధికారులు ఈ మార్కెట్‌ని మూసేశారు. దీనికి కారణం కరోనా ఇక్కడి నుంచే జోరుగా వ్యాపించిందనే అనుమానం.
జిన్ఫాడీ మార్కెట్‌లో భారీగా కరోనా వైరస్ జాడలు:
చివరకు అధికారుల అనుమానమే నిజమైంది. బీజింగ్ లోని జిన్ఫాడీ మార్కెట్ లో కరోనా వైరస్ జాడలు కనిపించాయి. జిన్ఫాడీ మార్కెట్ లోని సీఫుడ్(సముద్ర ఆహారం), జంతువుల మాంసం విభాగాల్లో భారీగా కరోనా వైరస్ జాడలను అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అక్కడి ఆహారం తీవ్రంగా కలుషితమైంది. ఆ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం, ఎక్కువ తేమ శాతం ఉండటం వైరస్ పెరగడానికి కారణాలుగా భావిస్తున్నారు. ఇక సీ ఫుడ్ మార్కెట్లలో పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమశాతం:
బీజింగ్ లో రీసెంట్ గా వెలుగుచూసిన కరోనా కేసుల్లో ఎక్కువమంది బాధితులు జిన్ఫాడీ మార్కెట్ లో పని చేసేవారే. సీఫుడ్, మాంసం స్టాల్స్ లో పని చేసేవారిలో అధికశాతం వైరస్ బారిన పడ్డారు. కరోనా బారిన పడిన ఇతరులతో పోలిస్తే ఈ మార్కెట్ లో పని చేసే వారిలో కరోనా లక్షణాలు తొందరగా బయటపడ్డాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువ తేమ.. వీటి కారణంగానే సీఫుడ్ మార్కెట్లు కరోనా వైరస్ కు కేంద్రాలుగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బీజింగ్ లో కరోనా వైరస్ విబృంభణకు సాల్మన్(చేపల్లో ఓ రకం) కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంతో సాల్మన్ దిగుమతిపై నిషేధం విధించారు. పచ్చి సాల్మన్ తినొద్దని ప్రజలను హెచ్చరించారు.
Read: మాంసం ప్యాకింగ్ ప్లాంట్‌లో 730 మందికి కరోనా..7వేలమంది క్వారంటైన్